Drug mafia: హీరోయిన్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ, ఇక మిగిలింది సుప్రీం కోర్టు, 60 Days నాటౌట్ !

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి సెంట్రల్ జైల్లో కాలం గడుపుతున్న స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకాలం సంజనా, రాగిణిలకు బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టు నిరాకరిస్తూ వచ్చింది. ప్రత్యేక కోర్టులో ఇక బెయిల్ రాదు అని డిసైడ్ అయిన హీరోయిన్లు రాగిణి, సంజనాలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఎప్పటిలాగే తమకు ఏపాపం తెలీదని, డ్రగ్స్ అంటేనే ఏమో తెలీదని, దానిని ఎప్పుడూ తీసుకోలేదని, బెయిల్ ఇవ్వాలని రాగిణి, సంజనాలు హైకోర్టుకు మనవి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్లతో పాటు ఈ కేసులో ఎవ్వరికీ బెయిల్ ఇవ్వరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీసీబీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో సంజనా, రాగిణిలకు ఊహించని షాక్ తగిలింది.

రాగిణి, సంజనాల బ్యాడ్ టైమ్

రాగిణి, సంజనాల బ్యాడ్ టైమ్

బెంగళూరు డ్రగ్స్ కేసు విచారణ చేసిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనాల మీద పంజా విసరడంతో కలకలం రేపింది. సెప్టెంబర్ 4వ తేదీన నటి రాగిణి, సెప్టెంబర్ 8వ తేదీన నటి సంజనా గల్రానీలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో విచారణ పూర్తి అయిన తరువాత రాగిణి, సంజనాలను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.

 చెయ్యని ప్రయత్నాలు లేవు

చెయ్యని ప్రయత్నాలు లేవు

బెంగళూరు డ్రగ్స్ కేసులో రాగిణి, సంజాలతో పాటు వారికి సన్నిహితంగా ఉన్న అనేక మంది అరెస్టు అయ్యి జైలుపాలైనారు. డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ హనీ రాగిణి ద్వివేది, బహుబాష నటి సంజనా గల్రానీతో పాటు ఇంతకాలం డ్రగ్స్ సేవించి జల్సాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్, వీరేన్ ఖన్నా, బీకే, రవిశంకర్, ప్రశాంత్ రంకు తదితరులు తమకు బెయిల్ మంజూరు చెయ్యాలని వేర్వేరుగా కోర్టును ఆశ్రయించారు. అయితే ఇంత వరకు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏ ఒక్కరికి బెయిల్ మంజూరు కాలేదు.

 ఇక లాభం లేదు

ఇక లాభం లేదు

బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల పరిస్థితి దీనంగా తయారైయ్యింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో మొదట అరెస్టు అయిన రాగిణి, తరువాత అరెస్టు అయిన నటి సంజనాలు బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. డ్రగ్స్ కేసులో పక్కా ఆధారాలతో చిక్కిపోయిన రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం లేదు.

 హైకోర్టులో చుక్కెదురు

హైకోర్టులో చుక్కెదురు

ప్రత్యేక కోర్టులో బెయిల్ రాదని తెలుసుకుని చివరికి హీరోయిన్లు సంజనా, రాగిణి, ఇదే కేసులో అరెస్టు అయిన ప్రశాంత్ రంకు వేర్వేరుగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 24వ తేదీన హైకోర్టులో బెయిల్ పిటీషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. ఆ రోజు వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం (నవంబర్ 3వ తేదీ) హీరోయిన్లు రాగిణి, సంజనాలతో పాటు ప్రశాంత్ రంకుకు బెయిల్ ఇవ్వడం కుదరదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.

 దేవుడా కాపాడు స్వామి

దేవుడా కాపాడు స్వామి

కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న సంజనా, రాగిణిలు షాక్ కు గురైనారు. హీరోయిన్లు సంజనా, రాగిణిలకు ఎలాగైనా బెయిల్ ఇప్పించాలని వారి తరపు న్యాయవాదులు ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. మొత్తం మీద రాగిణి సెంట్రల్ జైలుకు వెళ్లి రెండు నెలలు పూర్తి అయ్యింది. నాలుగు రోజులు ఉంటే సంజనా కూడా రెండు నెలల జైలు జీవితం పూర్తి చేసుకుంటుంది. దీపావళి పండగకైనా మాకు బెయిల్ ఇప్పించాలని సంజనా, రాగిణిలు వారి తరపు న్యాయవాదులను వేడుకుంటున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+