బెంగళూరులో డ్రగ్స్ మాఫియా..ఒక మహిళతో సహా ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్ .. భారీగా డ్రగ్స్ సీజ్
బెంగళూరులో మాదకద్రవ్యాల పెడలర్స్ ఆరోపణలపై ఒక మహిళ తో సహా ఇద్దరు నైజీరియన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి నెదర్లాండ్స్ మరియు ఇథియోపియా నుండి పోస్టల్ పార్సెల్ సర్వీస్ ద్వారా వచ్చిన మూడు వేల ఎక్స్టసీ మాత్రలు మరియు కొకైన్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఏజెన్సీ మంగళవారం తెలిపింది.

డ్రగ్ పెడలర్లుగా పని చేస్తున్న ఒక మహిళతో సహా ఇద్దరు నైజీరియన్లు అరెస్ట్
ఇంటెలిజెన్స్ అందిస్తున్న సమాచారం ప్రకారం డ్రగ్స్ సరఫరాదారుల కదలికలపై నిఘా పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిసెంబర్ 18 న బెంగళూరులోని విదేశీ పోస్టాఫీసు వద్ద డ్రగ్స్ ప్యాకెట్లను సేకరించడానికి వచ్చినప్పుడు ఎన్‌సిబి అధికారుల బృందం పక్కా స్కెచ్ వేసి మరీ పట్టుకుంది. డ్రగ్స్ పెడలర్లు గా పనిచేస్తున్న రామ్లా షెడాఫా నాన్సీ, ఇమ్మాన్యుయేల్ మైఖేల్‌లను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ పేర్కొంది. మొత్తం 3,000 పసుపు మరియు బూడిద రంగు ఉన్న ఎక్స్టసీ మాత్రలు, ఎమ్‌డిఎంఎ, 610 గ్రాముల బరువు ఉన్న ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు .

భారీగా ఎక్స్టసీ మాత్రలు,కొకైన్ స్వాధీనం
అంతేకాకుండా 235 గ్రాముల కొకైన్‌ను మరో పార్శిల్ నుంచి ఎన్‌సిబి బృందం స్వాధీనం చేసుకుంది.ప్రాధమిక దర్యాప్తులో ఎమ్‌డిఎంఎ మాత్రలు, పంపిణీ కోసం నెదర్లాండ్స్ నుంచి సేకరించినట్లు తేలింది. కొకైన్‌ను ఇథియోపియా నుండి తెప్పించినట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో అనేక మాదకద్రవ్యాల రాకెట్ల గుట్టు రట్టు చేస్తోంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో . ఇక తాజాగా బెంగళూరులో అరెస్టు చేసిన నైజీరియన్ల పాస్‌పోర్ట్‌లు నకిలీవని అధికారులు అనుమానిస్తున్నారు.

గత ఐదేళ్ళుగా పెరిగిపోయిన డ్రగ్స్ కల్చర్ .. మెట్రో నగరాలపై నజర్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
దేశంలో గత ఐదేళ్లుగా ఇటువంటి మాదకద్రవ్యాల వినియోగం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చాలా రెట్లు పెరిగిందని ఎన్‌సిబి పేర్కొంది. ముంబై, హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై , వంటి మెట్రో నగరాలలో డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది . సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఆ తర్వాత తీగ లాగితే డొంకంతా కదిలినట్లు డ్రగ్స్ మాఫియా గుట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రట్టు చేస్తూనే ఉన్నారు.
అరుదైన దివ్యభారతీ ఫోటోలు.. ఈ ఫోటోలు మీరు ఎప్పుడైనా చూశారా?
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications