వీడు తండ్రేనా?: కొడుకును అమ్మేసి.. సెల్ ఫోన్ కొన్నాడు, ఆపైన తాగి తందనాలాడాడు!

Posted By:
Subscribe to Oneindia Telugu

భువనేశ్వర్: ఒడిశాలోని భద్రక్‌లో ఓ తండ్రి చేసిన నిర్వాకం అంద‌రినీ నివ్వెర‌పోయేలా చేసింది. క‌న్న కొడుకును అమ్మేసిన ఆ తండ్రి.. వచ్చిన డబ్బుతో సెల్‌ఫోన్ కొనుక్కుని, మిగిలిన డబ్బుతో మద్యం తాగి తందనాలాడాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. స్వీపర్‌గా పనిచేస్తున్న బలరాంముఖి అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. దానికి తోడు ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్నాడు. ఇటీవ‌ల బలరాంను కలిసిన ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఓ వృద్ధ దంపతులు ఓ బాలుడిని దత్తత తీసుకోవాలని భావిస్తున్నారని చెప్పాడు.

alchoholic-father

దీంతో బలరాం వారితో బేర‌మాడి త‌న 11 నెల‌ల‌ కుమారుడిని రూ.25 వేలకు అమ్మేశాడు. వచ్చిన డబ్బుల్లోంచి రూ.2 వేలు పెట్టి సెల్‌ఫోన్ కొనుక్కున్నాడు. మిగిలిన డబ్బుతో తాగి తంద‌నాలాడి, తన పాపకు రూ.1500తో వెండి కడియాలు చేయించాడు. బలరాంకు పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

ఈ విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు. 60 ఏళ్ల సోమనాథ్‌ సేథి అనే వ్య‌క్తి ప్రభుత్వ సంస్థలో డ్రైవర్‌గా పనిచేసి రిటైరయ్యాడని, త‌మ‌ కుమారుడు 2012లో మృతిచెందడంతో అతడి భార్య డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. ఆమెను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు బాలుడిని దత్తత తీసుకున్నాడ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man has allegedly sold his son for Rs 25,000 in the Bhadrak district of Odisha. The price was paid fort the 11-month-old son and with the money, the father bought a mobile phone, silver anklet and alcohol. On Tuesday, father Balaram Mukhi was arrested. According to the police, Balaram Mukhi sold his 11-month-old son for Rs 25,000, and out of that sum, he spent Rs 2,000 on a mobile phone, Rs 1,500 on a silver anklet for his seven-year-old daughter and one saree for his wife, Sukuti. And with the remaining amount, Balaram bought alcohol for his session of debauchery. The police also questioned Balaram's wife, Sukuti. Balaram and Sukuti together have another 10-year-old son.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి