కరాచీలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌కు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం అత్యవసర పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని కరాచీలో ల్యాండ్ అయ్యింది. విమానంలో ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ ఘటన శనివారమే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్-అమృత్‌సర్ విమానంలోని ఓ ప్రయాణికుడికి మార్గమధ్యలో అకస్మాత్తుగా వైద్యపరమైన సమస్యలు తలెత్తాయి. దీంతో వీలైనంత త్వరగా అతడికి వైద్య సాయం అందించేందుకు కరాచీ కరాచీ అత్యంత సమీపంలో ఉండటంతో విమానాన్ని అక్కడికే మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

ల్యాండింగ్ అయిన వెంటనే సంబంధిత వ్యక్తికి వైద్య సేవలు అందించినట్లు చెప్పారు. ఆ తర్వాత విమానానాశ్రయ వైద్య సిబ్బంది అతడికి ప్రయాణించడానికి అనుమతిచ్చింది. దీంతో మానం కరాచీ నుంచి అమృత్ సర్‌కు చేరుకుందని విమానయాన సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో ఎయిరిండియా విమానం కొంత ఆలస్యంగా గమ్యస్థానాన్ని చేరుకుంది.
గతంలో కూడా ఇాలాంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జూలై నెలలో ప్రయాణీకుడి వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా ముంబై నుంచి రాంచీ ఇండిగో విమానాన్ని నాగ్‌పూర్ విమానాశ్రయానికి మళ్లించారు . ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అతను అనారోగ్యంతో మరణించాడు.












Click it and Unblock the Notifications