వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పీకే' సినిమాకు దుబాయ్, ఐఎస్ఐ పెట్టుబడి, విచారణకు డిమాండ్: స్వామి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమీర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమా నిర్మాణానికి పాకిస్ధాన్ ఇంటిలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ పెట్టుబడి పెట్టిందని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. పీకే సినిమా నిర్మించేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

పీకే సినిమాపై వెంటనే ప్రభుత్వం విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. 'పీకే' సినిమాను విధువినోద్ చోప్రా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, రాజ్ కుమార్ హిరానీ నిర్మించారు. అమీర్‌ఖాన్, అనుష్క శర్మ నటించిన పీకే సినిమాపై ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువత్తున్నాయి.

Dubai, ISI have funded movie PK: Subramanian Swamy

పీకే సినిమాపై వెంటనే ప్రభుత్వం విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. 'పీకే' సినిమాను విధువినోద్ చోప్రా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, రాజ్ కుమార్ హిరానీ నిర్మించారు. అమీర్‌ఖాన్, అనుష్క శర్మ నటించిన పీకే సినిమాపై ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువత్తున్నాయి.

ఇప్పటికే పలు ముస్లిం సంఘాలు, భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల నుంచి చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పీకే సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు.

హిందూ సంస్కతిని తక్కువ చేసి చూపే వారి చిత్రాలను ప్రజలు చూడరాదన్నారు. ఇస్లాం, క్రైస్తవ మతాల గురించి ఏదైనా మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించే వ్యక్తులు హిందూ మతం గురించి ఏమాత్రం ఆలోచించకుండా వారికి తోచిన విధంగా మాట్లాడటమో లేదా వారికి నచ్చినట్లుగా సినిమాల్లో చూపించడమో చేయడం మంచి పద్దతి కాదన్నారు.

పీకే సినిమాను నిలిపివేయాలంటూ కొన్ని చోట్ల థియేటర్లను ధ్వంసం చేశారు. ఇది ఇలా ఉంటే 'పీకే' సినిమాలో ఎలాంటి అభ్యంతరకరమైన సీన్లు లేవని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది.

సినిమా చూడడం ఇష్టం లేకుంటే మానేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇంతకుముందే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పీకే సినిమాను అద్భుతంగా నడిపారని, మనుషుల నమ్మకాలకు హేతుబద్దత ఉండాలనే దిశగా సినిమా నడిచిందని సినీ విమర్శకులు కూడా అభినందిస్తున్నారు.

English summary
Controversies revolving 'PK’ do not seem to end with BJP leader Subramanian Swamy on Monday alleging that the film has been funded from the underworld in Dubai & by Pakistani Intelligence Agency ISI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X