దట్టమైన పొగమంచు కారణంగా రైల్వేకు రూ. 1.22 కోట్ల నష్టం...
దట్టమైన పొగమంచు రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం పడింది. తీవ్ర చలిగాలులు, పొగమంచు వల్ల పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పొగమంచు వల్ల 20 వేల మంది ప్రయాణికులు తమ టికెట్లను కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఈ రద్దుతో రైల్వేశాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన పొగమంచుతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టిక్కెట్ల రద్దుతో రైల్వేశాఖకు రూ. 1.22 కోట్ల నష్టం వాటిల్లిందని భారతీయ రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాదిలోని చాలా జిల్లాల్లో తీవ్ర పొగమంచు కారణంగా భారతీయ రైల్వేల కార్యకలాపాలు చాలావరకూ దెబ్బతిన్నాయని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు.

డిసెంబర్ నెలలో భారతీయ రైల్వే పరిధిలోని మొరాదాబాద్ డివిజన్‌లో తీవ్ర పొగమంచు కారణంగా, చలిగాలుల ప్రభావంతో ప్రయాణికులు 20వేల టికెట్లను రద్దు చేశారు. టిక్కెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు రూ.1.22 కోట్లు తిరిగి చెల్లించామని మొరాదాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. రిజర్వ్ చేసిన టిక్కెట్లలో 4,230 బరేలీ టిక్కెట్లు రద్దు చేయగా, 3,239 టిక్కెట్లు మొరాదాబాద్‌లో రద్దు చేయడం జరిగింది. చలిగాలుల ప్రభావంతో, పొగమంచు కారణంగా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను రద్దు చేసినట్లు సింగ్ పేర్కొన్నారు. 3వేల 917 టిక్కెట్లు హరిద్వార్‌లో, 2వేల 448 ఇతర డెహ్రాడూన్‌లో రద్దు చేయబడ్డాయి.
మార్చి వరకు 42 రైళ్లు క్యాన్సిల్ : పొగమంచు కారణంగా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను రద్దు చేశామని సింగ్ పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 6 వరకు రాత్రి, ఉదయం చాలా గంటలపాటు దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. మార్చి వరకు 42 రైళ్లు క్యాన్సిల్ అయ్యాయని, ఈ రద్దు కారణంగా తాము ప్రజలకు 1.22 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications