ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది: సీఎం సీరియస్

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే నెపంతో ఓ ఇంటర్ విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు ఓ ఉన్మాది. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. జార్కండ్ రాష్ట్రంలోని దుమ్కా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని ఆగస్టు 23న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు షారుఖ్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సోమవారం తెల్లవారుజామున బాలిక అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.

Dumka Girl Murder: CM Soren Says Accused Will Be Given Strictest Punishment

అంకితా కుమారి అనే 12వ తరగతి చదువుతున్న బాలిక పరిస్థితి విషమించడంతో మొదట దుమ్కాలోని ఫూలో జానో మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తీసుకెళ్లబడింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమెను రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఆర్ఐఎంఎస్)కి రెఫర్ చేశారు.

దుమ్కా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అంబర్ లక్డా ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "నిందితుడైన షారుక్‌ను అరెస్టు చేశారు. వేగవంతమైన విచారణ కోసం మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దరఖాస్తు చేస్తాము. ప్రజలు మాకు సహకరిస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పరిస్థితి అదుపులో ఉంది. 144 సెక్షన్ విధించబడింది అని తెలిపారు.

ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా స్పందిస్తూ.. త్వరితగతిన విచారణ జరిగేలా నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

'దుమ్కాలో బాలిక హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మేము త్వరిత విచారణను నిర్ధారిస్తాము. ఈ విషయమై డీసీతో మాట్లాడాం' అని గుప్తా తన నివేదికలో ఏఎన్‌ఐ పేర్కొంది.

నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాగా, ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.

సమాజంలో చాలా దుర్మార్గాలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన హృదయ విదారకంగా ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటోంది. నిందితుడిని అరెస్టు చేశారు. అతనికి వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూడటమే మా ప్రయత్నం అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+