వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ పవర్ పంచ్: ఆ ఫోటోలు తీసేయండి, పవిత్రత కాపాడండి, లేదంటే !

అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల విలీనం విషయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం రోజుకో కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకువస్తోంది. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో శశికళ ఫోటోలు ఉండకూడదని

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల విలీనం విషయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం రోజుకో కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకువస్తోంది. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో శశికళ ఫోటోలు ఉండకూడదని పన్నీర్ సెల్వం వర్గం సూచించింది.

అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్, వారి కుటుంబ సభ్యులను బహిష్కరించాలని ఇప్పటి వరకు డిమాండ్ చేసిన పన్నీర్ సెల్వం వర్గం మంగళవారం మరో కొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకు వచ్చి ఎడప్పాడి పళనిసామి వర్గానికి సినిమా చూపించింది.

బహిష్కరిస్తే ఫోటోలు ఎందుకు ?

బహిష్కరిస్తే ఫోటోలు ఎందుకు ?

అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో శశికళ ఫోటోలు ఉండటానికి వీల్లేదని, తరువాతే మేము చర్చలకు ముందడుగు వేస్తామి తేల్చి చెప్పారు. శశికళ, టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు పార్టీ కార్యాలయంలో ఆమె ఫోటోలు ఎందుకు పెట్టుకున్నారని పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకుడు మధుసూదనన్ ప్రశ్నించారు.

శశికళ ఫోటోలు పడేయండి, పవిత్రత కాపాడండి

శశికళ ఫోటోలు పడేయండి, పవిత్రత కాపాడండి

శశికళ ఫోటోలు మొత్తం బయటపడేయండి, అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం పవిత్రతను కాపాడండి అనే నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. త్వరలో రాయపేట్ లోని కార్యాలయంలో ఎడప్పాడి, పన్నీర్ సెల్వం వర్గం చర్చలు మొదలు పెట్టడానికి సిద్దం అయిన సమయంలో ఈ కొత్త డిమాండ్ తెరమీదకు తెచ్చారు.

అన్ని జిల్లాల్లో తీసేస్తేనే వస్తాం

అన్ని జిల్లాల్లో తీసేస్తేనే వస్తాం

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు తమిళనాడులోని అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో శశికళ ఫోటోలు ఉన్నాయని తెలుసుకున్న పన్నీర్ సెల్వం వర్గం ఇప్పుడు ఈ కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకు వచ్చారు.

సినిమా చూపిస్తున్నారు

సినిమా చూపిస్తున్నారు

పన్నీర్ సెల్వం కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకురావడంతో ఎడప్పాడి పళనిసామి వర్గం ఇప్పుడు అయోమయంలో పడింది. నిజంగా శశికళను పార్టీ నుంచి బహిష్కరించి ఉంటే ఆమె ఫోటోలో ఎందుకు పెట్టుకున్నారు అని పన్నీర్ సెల్వం వర్గం సూటిగా ప్రశ్నిస్తోంది.

ప్రజలు మరిచిపోవాలని

ప్రజలు మరిచిపోవాలని

అన్నాడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు, తమిళనాడు ప్రజలకు శశికళను పూర్తిగా దూరం చెయ్యాలని పన్నీర్ సెల్వం వర్గం ఇప్పుడు ఈ డిమాండ్ తెరమీదకు తీసుకు వచ్చిందని స్పష్టంగా వెలుగు చూసింది. అయితే ఈ విషయంపై ఎడప్పాడి పళనిసామి వర్గం ఇంకా స్పందించలేదు.

English summary
Panneerselvam wants posters and photographs of jailed party chief VK Sasikala to be removed from the AIADMK's office in Chennai's Royapettah, where merger talks will be held between two rival factions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X