ఎంత అనాగరికం! ఎంత దుర్మార్గం! : 'పళ్లు రాలగొట్టి.. మలమూత్రాలను తాగించి'
భువనేశ్వర్ : రోజురోజుకు ఆధునికత కొంత పుంతలు తొక్కుతూ.. ఓవైపు ప్రపంచం జెట్ స్పీడ్ లో దూసుకెళుతుంటే.. శతాబ్దాల నాటి మూఢనమ్మకాల్లో ఇంకా మగ్గిపోతున్న గ్రామాలు, మనుషులు.. మంత్ర తంత్రాలనే మూఢంధకారంలోనే ఇంకా బ్రతుకుతుండడం శోచనీయం.
తాజాగా ఒడిశాలో జరిగిన ఓ ఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మంత్రగాళ్లు అనే నెపంతో పళ్లు పీకి.. ఆపై అత్యంత అమానుషంగా వాళ్ల చేత మలాన్ని తినిపించి, మూత్రాన్ని తాగించారు ఒడిశాకు చెందిన ఎస్బీ జగ్ దేబ్ పూర్ గ్రామస్తులు.

పూర్తి వివరాలను పరిశీలిస్తే.. ఎస్బీ జగ్ దేబ్ పూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఇటీవల మృత్యవాత పడ్డారు. అయితే పిల్లల మృతికి చేతబడే కారణమని, గ్రామంలో ఉన్న బసుదేవ్ నాయక్, బంచ్చానాయక్‌లే బొమ్మలతో చేతబడి చేశారన్నది గ్రామస్తుల అనుమానం. దీంతో వాళ్లిద్దరని ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి ఊరి నడిబొడ్డులో నిలబెట్టి ఇద్దరి పళ్లు పీకేశారు. అనంతరం వారిచేత మలమూత్రాలను తాగించారు.
ఇంత జరిగినా.. ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనుకాడరంటే.. అక్కడ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి ఇన్స్ పెక్టర్ సుజిత్ కుమారే స్వయంగా గ్రామానికి వచ్చినా.. బాధితులు మాత్రం ఆయన్ను కలవడానికి భయపడడం గమనార్హం. ఇదంతా ఇలా ఉంటే.. గత కొన్నేళ్లుగా ఒడిశాలో మంత్రగాళ్ల అన్న నెపంతో దాడులు జరుగుతూ వస్తున్నాయి. 2013లో ఒడిశా ప్రభుత్వం దీనిపై ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినా.. ఆచరణలో మాత్రం దాని ప్రభావం ఎక్కడా కనిపంచడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications