PM Internship Scheme : నిరుద్యోగ యువతకు కేంద్రం శుభవార్త-నేడే ప్రారంభం..!
నిరుద్యోగ యువతకు కేంద్రం దసరా శుభవార్త చెప్పింది. దేశంలో కోట్లాది సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువత కోసం ఓ సరికొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. గత బడ్జెట్ లో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగుల కోసం పీఎం ఇంటర్న్ షిప్ పథకాన్ని ప్రారంభిస్తోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ను కేంద్రం ప్రారంభించబోతోంది. అనంతరం యువత ఇందులో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
పీఎం ఇంటర్న్ షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రం కొన్ని అర్హతలు ఇచ్చింది. ఇందులో ఫుల్ టైమ్ కోర్సులకు దరఖాస్తు చేసుకుని ఉండకూడదు. 21-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే అర్హులు. ఎక్కడా ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. అలాగే కుటుంబంలో తల్లితండ్రులు కానీ, భార్య లేదా భర్త కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. అలాగే కుటుంబంలో ఏ ఒక్కరికీ ఏడాదికి రూ.8 లక్షలకు మించి ఆదాయం ఉండకూడదు.

పీఎం ఇంటర్న్ షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే https://pminternship.mca.gov.in/login/ వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందులో యూత్ రిజిస్ట్రేషన్ ఐకాన్ ప్రెస్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి కేంద్రం దేశంలోనే టాప్ కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్ షిప్ చేసే అవకాశం కల్పిస్తుంది. నెలకు రూ.4500 కేంద్రం, మరో 500 సదరు సంస్థ ట్రైనీలకు చెల్లిస్తాయి. అలాగే ఏడాదిలో ఒకసారి 6 వేల రూపాయలు ఇన్సిడెంటల్ ఖర్చుగా చెల్లిస్తుంది. అలాగే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి ఇంటర్న్‌కు బీమా కవరేజీ కల్పిస్తారు.












Click it and Unblock the Notifications