దసరా నవరాత్రుల వేళ అద్భుతం.. ఈ ఆలయంలో అమ్మవారికి చెమటలు..
భారతేదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ మన సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అలాగే ఒక్కో ప్రాంతంలోని ఆలయంలో ఒక్కో ప్రత్యేకత దాగి ఉంటుంది. అందుకే ఈ పురాతన ఆలయాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది తరలి వస్తుంటారు. దసరా నవరాత్రుల వేళ ఇలాంటి ఒక మహిమాన్విత ఆలయం గురించి మనమిప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలోని అమ్మవారికి చెమటలు పడతాయి. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది నిజం.. రండీ ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది వాటి విశేషాలేంటో తెలుసుకుందాం.
ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉంది. ఇక్కడ కాళికాదేవి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఈ దేవాలయం 500 ఏళ్ల పురాతనమైనది. ఇక్కడి ఆలయంలోన అమ్మవారిని దేశవ్యాప్తంగా 'AC వలీ కాళి దేవి' అని అంటారు. ఎదుకంటే, ఈ ఆలయంలోని అమ్మవారికి చెమటలు పడతాయి. అది కూడా ఏసీ ఆగితేనే. ఈ ఆలయంలోని అమ్మవారి దేహానికి ఎండకాలంలో ఏసీ ఆపితే చాలు చెమటలు పడతాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, చాలా మంది ఇక్కడికి వచ్చిన వారు ఈ సంఘటనను ఒక అద్భుతంగా భావిస్తున్నారు. ఇది కాళీకా దేవి దైవిక శక్తికి నిదర్శనమని చెబుతున్నారు. అయితే, మరికొందరేమో ఈ ఘటన వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందని అభిప్రాయ పడుతున్నారు. విగ్రహం తయారు చేసిన రాయిలోని పదార్థం ఆలయ వాతావరణంలో తేమ కారణంగా ఇలా జరిగుతుందేమోని కొందరి విశ్వాసం. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఇంకా తెలియలేదు కానీ, ఇది ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది.

కూలర్లు, ఏసీలు ఏర్పాటు..
అయితే, ఈ చెమటలు పట్టే కాళీ అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ప్రజలు తమ కోరికలను తీర్చమని అమ్మవారిని వేడుకుంటారు. ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా వివిధ మతపరమైన ఉత్సవాలను, పూజలను నిర్వహిస్తారు. ఇక్కడ దసరా నవరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం చలికాలంలో అంతా బాగానే ఉంటుందని, వేసవి రాగానే కాళీ విగ్రహానికి చెమటలు పడతాయని అంటున్నారు. చెమటలు ఎంతలా పడతాయంటే ఆలయ పూజారి అమ్మవారి బట్టలు మార్చే సమయంలో అమ్మవారి బట్టలు పూర్తిగా తడిసి పోతాయని అంటున్నారు. అందుకే అమ్మవారికి అప్పటి నుంచి భక్తులు కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేశారు. వేసవిలో అయితే ఏసీ 24 గంటలు నడుస్తూనే ఉంటుందట. ఇతర కారణాలతో ఏసీ ఆగిపోతే వెంటనే అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు పడతాయని ఇక్కడివారు చెబుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications