ఢిల్లీ వర్సిటీలో ఎన్ఎస్‌యూఐ గెలుపు, 2 పోస్ట్‌లు గెలుచుకున్న ఏబీవీపీ
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎన్ఎస్‌యుఐ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవులను గెలుచుకుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎన్ఎస్‌యుఐ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవులను గెలుచుకుంది. ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి పదవులను దక్కించుకుంది.
ఎన్ఎస్‌యుఐ అధ్యక్ష అభ్యర్థి రాకీ తుషీద్ బుధవారం జరిగిన లెక్కింపులో ఏబీవీపీ అభ్యర్థి రజత్ చౌదరీని ఓడించారు. ఏఐఎస్ఏ అభ్యర్థి పరుల్ చౌహా కూడా ఓటమి చవి చూశారు.

బిజెపి అనుబంధ సంస్థ ఏబీవీపికి చెందిన మహామేధా నగర్ కార్యదర్శి పదవికి పోటీ చేసి గెలిచారు.
కాగా, ఐదేళ్ల తర్వాత ఢిల్లీ వర్సిటీలో ఎన్ఎస్‌యుఐ గెలుపొందింది. 2007లో గెలిచిన ఎన్ఎస్ ఆ తర్వాత 2012లో ఓడిపోయింది. మూడు పదవుల్లో ఏదీ కూడా గెలవలేదు. ఇప్పుడు మళ్లీ రెండు పదవులను దక్కించుకుంది.












Click it and Unblock the Notifications