శుభవార్త: కిరాణ మార్కెట్లోకి ముఖేష్ అంబానీ, జియో కష్టమర్లకు డిస్కౌంట్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోతో టెలికం రంగంలోనే విప్లవం సృష్టించారు ముఖేష్ అంబానీ.అయితే టెలికం రంగంతో పాటు కిరాణ మార్కెట్లో కూడ ప్రవేశించాలని ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తన్నారు.
రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశం సంచనాలతో ప్రారంభైంది. ఉచితంగానే వాయిస్ కాల్స్, డేటాలను అందిస్తూ ఉచిత సేవలను రిలయన్స్ జియో తన కష్టమర్లకు అందించింది.
జియో రంగ ప్రవేశంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్‌లను మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే కొత్త కొత్త పథకాలు , ప్లాన్స్‌తో రిలయన్స్ జియో మార్కెట్లోకి వస్తోంది. తాజాగా కిరాణా మార్కెట్లోకి ప్రవేశించాలని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

కిరాణా మార్కెట్లోకి దిలయన్స్
కిరాణా మార్కెట్లో ప్రవేశించేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు. భారత్ మార్కెట్‌పై బహుళ జాతి సంస్థలు కన్నేసి పనిచేస్తున్నాయి. అయితే ఇదే తరుణంలో ముఖేష్ అంబానీ కూడ కిరాణా రంగంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో ఉండే కిరాణా దుకాణాలను కూడ లక్ష్యంగా చేసుకొని ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు.

జియో కష్టమర్లకు డిస్కౌంట్లు
రిలయన్స్ జియో తన కస్టమర్లకు కిరాణా దుకాణాల్లో తగ్గింపు ధరలకే కొనుగోలు చేసుకునేలా డిజిటల్ కూపన్లను ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం జియో తన సొంత నిధులను ఖర్చు పెట్టదు. కేవలం తయారీదారులు, కిరాణా దుకాణాలకు, తన చందాదార్లను పరిచయం చేసి... తద్వారా తన చందాదారులకు ప్రయోజనం కల్పించడంపై దృష్టి సారిస్తుంది.

ఉత్పత్తుల ప్రమోషన్ కోసమిలా
వస్తువుల తయారీదారులకు వారి బ్రాండ్ల ప్రమోషన్ జరుగుతుంది. కిరాణా దుకాణాలకు మరింత మంది కస్టమర్లు చేరువవుతారు. ఈ తగ్గింపు ఆఫర్లతో జియో సైతం ప్రస్తుత తన కస్టమర్లను కాపాడుకోవడంతో పాటు కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతుంది. ఇప్పటికే ముంబై, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయోగాత్మక ప్రాజెక్టు మొదలైంది. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని ముకేశ్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు.

చిన్న కిరాణా దుకాణాలే లక్ష్యం
650 బిలియన్ డాలర్ల దేశ రిటైల్ పరిశ్రమలో ఈ కామర్స్ కంపెనీల వాటా కేవలం 3-4 శాతంగానే ఉంది. వ్యవస్థీకృత రిటైలర్ల(పెద్ద మాల్స్) వాటా 8% ఉండగా, 88% వాటా చిన్న కిరాణా దుకాణాల చేతుల్లోనే ఇప్పటికీ ఉండటం గమనార్హం. ఇంత భారీ మార్కెట్ అవకాశాలను అంబానీ ఏ రకంగా తనకు అనుకూలంగా మార్చుకొంటాడో చూడాల్సి ఉంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications