ఢిల్లీ, నోయిడా, గుర్గావ్‌లో భూకంపం: యూపీ, పంజాబ్‌లో కూడా, జనం పరుగులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో శుక్రవారం రాత్రి 9.08 గంటల భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్ సీఎస్) ప్రకారం.. రిక్టారు స్కేలుపై 4.6గా తీవ్రత నమోదైంది. గుర్గావ్, నోయిడాలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

హర్యానాలోని రోహ్తక్‌కు 16 మీటర్ల దూరం వరకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది. కాగా, ఢిల్లీలో గత కొంత కాలంగా భూకంపాలు తరచూ చోటు చేసుకుంటుండటం గమనార్హం.

Earthquake hits Delhi, Noida, Gurugram; tremors also felt in Uttar Pradesh, Punjab

కాగా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సమాచారం. మే 15న కూడా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. రిక్టారు స్కేలుపై తీవ్రత 2.2గా నమోదైంది.

మే 10న కూడా ఢిల్లీలో భూకంపం సంభవించింది. 3.5గా రిక్టారు స్కేలుపై తీవ్రత నమోదైంది. ఈ రెండు భూకంపాల వల్ల కూడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఏప్రిల్ 13 కూడా భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై 3.5గా తీవ్రత నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+