పాల్ఘర్‌లో భూకంపం: భయంతో జనం బయటకు పరుగులు, లడఖ్‌లోనూ..

ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మంగళవారం రాత్రి 9.33 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్ సీఎస్) వెల్లడించింది.

అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగినట్లు సమాచారం లేదు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. అధికారులు పరిస్థితిపై సమీక్షిస్తున్నారు.

 Earthquake hits Maharashtra, tremors felt in Palghar

లడఖ్‌లోనూ భూకంపం

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని లేహ్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.1గా నమోదైంది. మంగళవారం ఉదయం 5.13 గంటలకు భూకంపం సంభవించగా, దీని భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. కాగా, గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో తరచూ స్వల్ప భూకంపాలు సంభవిస్తుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+