హర్యానాలో భూకంపం: రిక్టార్ స్కేలుపై 3.7 తీవ్రత -ఆ ధాటికి ఢిల్లీలోనూ ప్రకంపనలు
ఉత్తరాది రాష్ట్రం హర్యానాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. దాని తీవ్రతకు దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తొలుత ఢిల్లీలోనే భూకంపం వచ్చినట్లు వార్తలు రావడం, ఢిల్లీ వాసులంతా సోషల్ మీడియాలో దీనిపై స్టేటస్ లు పెట్టడంతో ఏం జరిగిందనేదానిపై జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ) ప్రకటన చేసింది.

ప్రభుత్వ అధికారుల వివరణ ప్రకారం.. హర్యానాలోని ఝాజర్ జిల్లా కేంద్రానికి ఉత్తరంగా 10 కిలోమీటర్ల దూరంలో, భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టార్ స్కేలుపై దాని తీవ్రత 3.7గా నమోదైంది. భూకంప కేంద్రంగా గుర్తించిన ప్రాంతం.. ఢిల్లీకి కేవలం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో
Recommended Video
దేశ రాజధాని ఢిల్లీలోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. హర్యానా, ఢిల్లీల్లో ప్రపంకపలకు జనం ఆందోళన చెందారు.












Click it and Unblock the Notifications