లఢఖ్‌లో భూకంపం: కార్గిల్ సమీపంలో భూకంప కేంద్రం
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కార్గిల్ వాయూవ్యంలో 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇది భూ ఉపరితలానికి 25 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది.
ఇప్పటి వరకు భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. శుక్రవారం రాత్రి 8.15 గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు.

కాగా, శుక్రవారం మేఘాలయా రాష్ట్రంలో కూడా భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. మేఘాలయాలోని తురకు పశ్చిమాన 79 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
దేశ రాజధాని ప్రాంతంలో కూడా 2.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. హర్యానాలోని రోహ్తక్లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలి కాలంలో ఉత్తర భారతదేశంతోపాటు ఈశాన్య భారతదేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటం గమనార్హం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications