ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడాతోపాటు ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు చోటు చేసుకుంది. దీంతో ఇళ్లలోంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
ఢిల్లీ రాజధాని ప్రాంతంతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వసుంధర, ఘజియాబాద్‌లోనూ భూమి కంపించింది. అయితే, భూకంప తీవ్రత ఎంతమేర నమోదైందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. స్వల్ప భూ ప్రకంపనలు కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

అయితే, పొరుగు దేశాల్లో సంభవించిన భారీ భూకంపం ప్రభావం మనదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, రావల్పిండిలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications