భూకంపం, భయంతో ఇళ్ళను ఖాళీ చేసిన ప్రజలు
మేఘాలయాలోని తూర్పు గారో పర్వత ప్రాంతంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.
షిల్లాంగ్:మేఘాలయాలోని తూర్పు గారో పర్వతప్రాంత సమీపంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5 గా నమోదైంది.
ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ కేంద్రంగా ఈ భూకంపకేంద్రం ఉందని అధికారులు గుర్తించారు.
గత సోమవారం నాడు రాత్రి కూడ ఉత్తరాఖండ్ తో పాటు ఉత్తరభారతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం కూడ ఉత్తరాఖండ్ లోనే ఉందని అధికారులు గుర్తించారు.

ఆదివారం నాడు ఉదయం రుద్రప్రయాగ కేంద్రంగా భూకంపం చోటుచేసుకొంది. మేఘాలయాలోని గారో పర్వత సమీపంలో భూప్రకంపనలు చోటుచేసుకొన్నట్టుగా నేషనల్ సీస్మోలాజికల్ బ్యూరో అధికారులు చెప్పారు.
తొలుత రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.8 గా గుర్తించారు. 33 కిలోమీటరల లోతులో భూ ప్రకంపలను చోటుచేసుకొన్నాయని ఐఎండి తెలిపింది.
ఈ భూప్రకంపనల కారణంగా స్థానికులు ఇళ్ళను వదిలి వెల్ళిపోయారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందనే భయంతో వారు వెళ్ళిపోయారని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications