ఢిల్లీలో భూకంపం - ఉలిక్కి పడ్డ జనం..!!
దేశ రాజధాని ఢిల్లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజాము 5:36 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయింది. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.తెల్లవారుజామునే భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీతో పాటు నోయిదా, గురుగాం ప్రాంతాల్లో భూప్ర కంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామునే భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఢిల్లీలతోపాటు రాజధాని ప్రాంతంలోని నోయిడా, గురుగ్రామ్‌లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా స్పష్టత లేదని అధికారులు చెప్పారు.

కాగా, భూ ప్రకంపణల పైన మాజీ సీఎం ఆతిశీ స్పందించారు. ఢిల్లీలో భారీ భూకంపం వచ్చిందని, అంతా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధించినట్లు పేర్కొన్నారు. కాగా, ఆదివారం అర్ధ రాత్రి 11.16 గంటలకు బంగాలాఖాతంలో భూమి కంపించింది. భూఅంతర్భాగంలో 35 కిలో మీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయి. ఢిల్లీ భూ ప్రకంపణలతో ఎవరికి ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications