ఎవరెస్ట్ వద్ద భూకంప కేంద్రం: మెట్రోకు అంతరాయం

న్యూఢిల్లీ: నేపాల్లో మంగళవారం సంభవించిన భారీ భూకంపం కేంద్రం ఎవరెస్ట్‌కు చాలా దగ్గర్లో ఉంది. ఎవరెస్ట్ ఎక్కడానికి పర్వతారోహకులు తమ యాత్రను ప్రారంభించే ప్రాంతమైన నామ్ చేబజార్ పట్టణానికి అతి సమీపంలో భూకంప కేంద్రం ఉంది.

హిమాలయ దేశం నేపాల్‌లో భూకంపం మళ్లీ ఈ రోజు వణికిన విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం వచ్చిన భూకంపంలో వేలాది మంది మృతి చెందారు. మంగళవారం వరుసగా వచ్చిన భూకంపానికి 26 మంది వరకు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడి పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మొదటి భూకంప కేంద్రం నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌కి ఎవరెస్టు పర్వతానికి మధ్య, రెండో భూకంప కేంద్రం నేపాల్‌లోని కోడారి ప్రాంతానికి 73 కిలోమీటర్ల ఆగ్నేయంగా ఉన్నట్లు గుర్తించారు.

ఈ భూకంప ప్రభావానికి చౌటారా ప్రాంతంలో ఒక భవనం నేలకూలింది. నేపాల్లో గంటలో నాలుగుసార్లు ప్రకంపనలు వచ్చాయి. నేపాల్లో ఓ భవనం కూలడం వల్లే 9 మంది మృతి చెందారు.

Earthquake spreads panic in Kolkata, Be ready for rescue, relief: PM Modi

మెట్రో సేవలకు అంతరాయం

నేపాల్ భూకంపం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కోల్‌కతా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ మెట్రో సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. భూప్రకంపనల వల్ల బీహార్లో 15మంది మృతి చెందారు. భూకంపం నేపథ్యంలోసుప్రీం కోర్టు నేటి విచారణలు నిలిపివేసింది.

కేజ్రీవాల్ ట్వీట్

నేపాల్లో భూకంపం నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. అంతా ప్రశాంతంగా ఉండాలని, అధికారులు ఇప్పటికే పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. కాగా, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+