వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో బీజేపీదే గెలుపు, 46సీట్లు: కేజ్రీవాల్ కంటే మోడీకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని ఆధిక్యం వస్తుందని సర్వేలు చెబుతున్నాయు. ఏబీపీ న్యూస్ - నీల్సన్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటుతుందని తేలింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాతో బీజేపీ 46 స్థానాలు గెలుచుకోవచ్చునని ఈ సర్వే తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు దక్కవచ్చునని తెలిపింది.

ఈ సర్వే ప్రకారం ముఖ్యమంత్రిగా సమర్థుడైన వ్యక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు 39 శాతంమంది మద్దతు పలికారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్‌కు 38 శాతం మంది మద్దతు పలికారు. వీరిద్దరు మొదటి రెండో స్థానాల్లో నిలిచారు.

Easy win for BJP in Delhi, predicts poll

మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌కు ఏడు శాతం, జగదీశ్ ముఖీకి ఐదు శాతం మంది మద్దతు పలికారు. మొత్తం మీద బీజేపీకి 38 శాతం, ఏఏపీకి 26 శాతం ఓట్లు వస్తాయని తేలింది. కేజ్రీవాల్ 49 రోజుల పాలనతో సంతృప్తి చెందినట్లు రెండింట మూడొంతుల మంది తెలిపారు.

63 శాతం మంది మద్దతుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ప్రజాధరణ ఉన్న వ్యక్తిగా నిలిచారు. ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు 25 శాతం, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి 12 శాతం మంది మద్దతు పలికారు.

పార్లమెంట్‌ సమావేశాలకు సిద్ధం కండి: మోడీ

ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల కోసం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులను కోరారు.

అనవసర పర్యటనలు కట్టిపెట్టి సమావేశాలు జరిగినన్ని రోజులూ సభకు హాజరు కావాలని సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో స్పష్టం చేశారు. కొత్త బిల్లులతో పాటు పెండింగ్‌ బిల్లుల ఆమోదానికి రంగం సి ద్ధం చేయాలని కోరారు. అధికారం చేపట్టాక రెండోసారి జరుగుతున్న ఈ సమావేశాల్లో 30-35 బిల్లులను ఆమోదింప చేసుకోవాలని మోడీ ప్రభుత్ం భావిస్తోంది.

English summary
BJP will get a comfortable majority in Delhi, with Aam Aadmi Party reduced to a distant second and Congress completely routed, an opinion poll conducted by ABP News-Nielsen has predicted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X