వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజాసింగ్ పై ఈసీ సీరియస్ - 72 గంటల పాటు ప్రచారంపై నిషేధం : ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

సంచలన వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన ఎన్నిల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగ రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. యూపీలో యోగికి ఓటెయ్యని వాళ్లను శిక్షించేందుకు బుల్‌డోజర్లు సిద్ధంగా ఉన్నాయని గోషామహల్‌ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. కేంద్రం ఎన్నికల సంఘం కూడా ఈ వ్యాఖ్యలపై సీరియస్‌ అయ్యింది. ఈ క్రమంలో యూపీ ఓటర్లను బెదిరించారంటూ రాజా సింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

ఐపీసీ, ఆర్‌పీ చట్టం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది. కాగా తామిచ్చిన షోకాజ్‌ నోటీసులకు గడువు లోగా సమాధానం ఇవ్వకపోవడంతోనే తాజా చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ నోటీసులపై వెంటనే స్పందించిన రాజాసింగ్​.. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని సమర్థించుకున్నారు.

EC 72-hour statement ban on MLA Rajasingh, directed for register FIR

Recommended Video

ప్రధాని అయ్యే అర్హత రాహుల్ గాంధీ కి లేదన్న బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్

యోగి ఆదిత్యనాథ్​ మరోసారి సీఎం కావాలని రాజస్థాన్‌ ఉజ్జయినిలో మూడు రోజుల పూజా కార్యక్రమం పెట్టుకున్నట్టు తెలిపారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక ఈసీకీ వివరణ ఇస్తానని వెల్లడించారు. దీంతో..తాజాగా ఎన్నికల సంఘం రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 72 గంటల పాటు ర్యాలీలు , బహిరంగసభల్లో పాల్గొనవద్దని , మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని కూడా ఈసీ రాజాసింగ్‌ను ఆదేశించింది.

English summary
The Election Commission directed Telangana chief electoral officer to register a case against Telangana BJP MLA T Raja Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X