రాహుల్ వర్సెస్ ఈసీ వార్- ! విపక్ష నేత మరో ఆరోపణకు కౌంటర్ ..!
కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ కర్నాటకలో ఓట్ల చోరీపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ ఆరోపణలపై మండిపడుతున్న ఎన్నికల సంఘం.. ఆయన్ను తన ఆరోపణలపై ప్రమాణం చేసి వివరాలు ఇవ్వాలని, లేదంటే దేశానికి క్షమాపణలు చెప్పాలంటూ ఉరుముతోంది. అయితే రాహుల్ స్పందించకపోవడంతో తానే స్వయంగా ఫ్యాక్ట్ చేసి వివరాలను విడుదల చేస్తోంది.
ఇదే క్రమంలో రాహుల్ గాంధీ తాజాగా చేసిన ఓట్ల చోరీ ఆరోపణల్లో ఒకటైన బెంగళూరు వృద్ధురాలి ఓట్ల నమోదుపై ఇవాళ ఈసీ ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది. శకునా రాణి అనే 70 ఏళ్ల మహిళ తొలిసారి ఓటు నమోదు చేసుకుందని, ఫామ్ 6ను దుర్వినియోగం చేసి ఒకే నెలలో రెండు ఓట్లు నమోదు చేయించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. రాహుల్ ఆరోపణల్ని తోసిపుచ్చింది.

తమ విచారణలో శకున్ రాణి రాహుల్ గాంధీ చెప్పినట్లు రెండుసార్లు కాదు, ఒక్కసారి మాత్రమే ఓటు వేసిందని తేలినట్లు ఈసీ పేర్కొంది. బెంగళూరులో ప్రజెంటేషన్ సందర్భంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. శకున్ రాణి ఓటరు గుర్తింపు కార్డును వాడి రెండు ఓట్లు వేశారని, పోలింగ్ బూత్ అధికారి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిక్ మార్కులు ఉన్న పత్రాన్ని చూపించారని ఆరోపించారు. అయితే, ఎన్నికల కమిషన్ తన 5 పాయింట్ల సమాధానంలో రాహుల్ చూపించిన పత్రం పోలింగ్ అధికారి జారీ చేసింది కాదని తేల్చేసింది.
Notice to Shri Rahul Gandhi, Hon’ble Member of Parliament and LoP, Lok Sabha.@ECISVEEP pic.twitter.com/plSfgoeytZ
— Chief Electoral Officer, Karnataka (@ceo_karnataka) August 10, 2025
పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శకున్ రాణి రెండుసార్లు ఓటు వేసినట్లు మీరు చెప్పారని ఈసీ గుర్తుచేసింది. అయితే తమ అధికారులు నిర్వహించిన ప్రాథమిక విచారణలో మీరు ప్రజెంటేషన్‌లో చూపించిన టిక్ మార్క్ చేసిన పత్రం పోలింగ్ అధికారి జారీ చేసిన పత్రం కాదని తేలినట్లు ఈసీ ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొంది. దీనిపై రాహుల్ గాంధీకి సంబంధిత పత్రాలు ఇవ్వాలని నోటీసు పంపినట్లు ఈసీ తెలిపింది. వీటి ఆధారంగా శకున్ రాణి లేదా మరెవరైనా రెండుసార్లు ఓటు వేశారో లేదో సమగ్ర విచారణ చేపట్టవచ్చని స్పష్టం చేసింది.

రాహుల్ గాంధీ తన పార్టీ డిజిటల్ ఓటరు జాబితా, ఓటింగ్ బూత్ సీసీటీవీ ఫుటేజ్ ను ఈసీ నుంచి కోరామని, కానీ వారు ఆ సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో తాము స్వంత దర్యాప్తు చేసామని, సమాచార హక్కు పిటిషన్లు దాఖలు చేసిన వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. అందులో లభించిన ఆధారాలతో ఈసీ, బీజేపీ ఓట్లు దొంగిలించాయని ఆరోపించారు.












Click it and Unblock the Notifications