రాహుల్ గాంధీ గురించి మాత్రం చెప్పలేం: జవదేకర్ వ్యంగ్యం
ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అజ్ఞాతం పైన కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ సెటైర్లు వేశారు. పార్లమెంటు సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ సెలవులకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై జవదేకర్ మంగళవారం తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సూర్య, చంద్ర గ్రహణాలు ఎఫ్పుడు వస్తాయో చెప్పవచ్చును కానీ రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రత్యక్షమవుతారో ఎవరు చెప్పలేరన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఏప్రిల్ 19వ తేదీ చేపట్టనున్న రైతు రాయ్లీలో రాహుల్ పాల్గొంటారని కాంగ్రెస్ ప్రకటించింది.
దీనిపై విలేకరులు జవదేకర్‌ను అడిగారు. దీంతో ఆయన పైవిధంగా స్పందించారు. రెండోసారి భూసేకరణ ఆర్డినెన్స్ జారీ చేయడానికి కేంద్రం చేస్తున్న యత్నాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు అన్నీ కలిసి రైతు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి. ఈ ర్యాలీలో రాహుల్ కూడా పాల్గొంటారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

ఉగ్రవాద వ్యతిరేక బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం
ఇప్పటికే మూడుసార్లు రాష్టప్రతి తిరస్కరించిన వివాదాస్పద గుజరాత్ యాంటీ టెర్రరిస్టు బిల్లును రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం మరోసారి ఆమోదించింది. పాత బిల్లు పేరు మార్చినప్పటికీ టెలిఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి, వాటిని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించడానికి పోలీసులకు అధికారాలు కల్పించడం లాంటి వివాదాస్పద నిబంధనలను మాత్రం అలాగే ఉంచారు.
అంతేకాక నేరాన్ని అంగీకరిస్తూ నిందితులు పోలీసుల మందు ఇచ్చిన స్టేట్‌మెంట్లను కోర్టులు అనుమతించడానికి, అలాగే చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు దర్యాప్తును పూర్తి చేయడానికి ఇంతకు ముందు నిర్దేశించిన 90 రోజుల గడువును 180 రోజులకు పొడిగిస్తూ బిల్లులో నిబంధనలను రూపొందించారు.
గుజరాత్ ఉగ్రవాద, వ్యవస్థీకృత నేరాల అదుపు బిల్లు- 2015ను మంగళవారం ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ప్రతిఘటన మధ్య మెజారిటీ ఓటుతో ఆమోదించారు. బిల్లులోని వివాదాస్పద నిబంధనలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది.












Click it and Unblock the Notifications