వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమాస్తులు:గుజరాత్ చాయ్ వాలాకు చెందిన రూ.1.02 కోట్లు జప్తు, 20 బినామీ ఖాతాలు

టీ,స్నాక్స్ అమ్ముకొని వేలాది కోట్లు సంపాదించాడు గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారి. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఈ టీ వ్యాపారి ఉదంతం వెలుగుచూసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుజరాత్:టీ, స్నాక్స్ అమ్ముకొని వేలాది కోట్లు సంపాదించాడు గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారి. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఈ టీ వ్యాపారి ఉదంతం వెలుగుచూసింది. గుజరాత్ కు చెందిన కిషోర్ భజియావాలా వడ్డీ వ్యాపారం ఉదంతం పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత వెలుగు చూశాయి.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన టీ వ్యాపారి కిషోర్ భజియావాలా . టీ వ్యాపారంతో పాటు వడ్గీ వ్యాపారం కూడ చేసేవాడు. డబ్బులు వడ్డీలకు ఇచ్చి, వసూలు చేసే సమయంలో ప్రజలను పీడించేవాడు. ఈ ఉదంతాలన్ని ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి.

ED attaches assets over Rs 1 crore of Surat-based businessman in PMLA case

టీ వ్యాపారి కిషోర్ భజియావాలాకు చెందిన ఆస్తులన్నింటిని గతంలోనే ఈడీ జప్తు చేసింది. తాజాగా మరో 1.02 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆఫ్ 2002 ప్రకారంగా ఈ ఆస్తులను జప్తు చేసినట్టుగా ఈడీ వెల్లడించింది.

కిషోర్ కు సంబందించిన అక్రమాస్తులను జప్తు చేసే కార్యక్రమాలను ఈడీ వేగవంతం చేసింది. మరిన్ని అక్రమాస్తులను స్వాధీనం చేసుకొనేందుకు ఈడీ చర్యలను చేపట్టింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్ల డబ్బును మార్పిడి చేసుకొనేందుకుగాను భజియావాలా వ్యవహరం వెలుగుచూసింది. గత డిసెంబర్ మాసంలోనే ఆయన ఇంటిపై బందువుల ఇళ్ళలోనూ ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో కిషోర్ భజియావాలాకు లెక్కలు చూపని ఆస్తులు సుమారు.రూ.10.46 కోట్లతో పాటుగా మరో 400 కోట్ల రూపాయాల విలువైన ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

తన వద్ద ఉన్న నల్లధనాన్ని బ్యాంకుల్లో వేసి తిరిగి విత్ డ్రాయల్ చేసుకొనేందుకుగాను ఆయన వందల మందిని ఉపయోగించేవాడని అధికారులు గుర్తించారు.కిషోర్ కు సుమారు 27 బ్యాంకు ఖాతాలున్నాయి. అందులో 20 బ్యాంకు ఖాతాలు బినామీల పేరుతోనే ఉన్నాయి.

గత ఏడాది డిసెంబర్ లో రూ.1.45 కోట్ల నగదు, రూ.1.48 కోట్ల విలువైన బంగార, రూ.4,92,96,314 కోట్ల విలువైన వజ్రాల ఆభరణాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రస్తుతం కిషోర్ భజియావాలా కేసును సిబిఐ విచారిస్తోంది.

English summary
he Enforcement Directorate on Thursday attached assets worth Rs 1,02,16,000 of Gujarat-based financier Kishore Bhajiawala under Prevention of Money Laundering Act (PMLA) case.Earlier on January 20, Bhajiawala was arrested by the ED in connection with the same case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X