DKS: పాదయాత్ర చేసింది చాలు, వెంటనే ఢిల్లీ వచ్చేయండి, డీకే బ్రదర్స్ కు ఈడీ షాక్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్ డీకే శివకుమార్ కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు కచ్చితంగా మీరు ఢిల్లీలోని కార్యాయానికి వచ్చి విచారణ ఎదుర్కొవాలని సూచించారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ జోడో యాత్రం జరుగుతున్న సమయంలో, సోనియా గాంధీ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో తనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని రాజకీయ కక్ష సాధింపులు సాగిస్తున్నారని, విచారణకు హాజరుకావడానికి సమయం ఇవ్వాలని మనవి చేసినా ఈడీ అధికారులు పట్టించుకోవడం లేదని డీకే శివకుమార్ ఆరోపించారు.

 రాహుల్ గాంధీ పాదయాత్రం

రాహుల్ గాంధీ పాదయాత్రం

రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి టూ కాశ్మీర్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర సక్సస్ చెయ్యాలని కేపీసీసీ అధ్యక్షుడు మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్ కంకణం కట్టుకున్నారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చెయ్యాలని డీకే. శివకుమార్, డీకే. సురేష్ సోదరులు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు.

 రాహుల్ గాంధీకి సోనియా మద్దతు

రాహుల్ గాంధీకి సోనియా మద్దతు

కర్ణాటకలో జోడో యాత్రం జరుగుతున్న సమయంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. కొన్ని రోజుల నుంచి సోనియా గాంధీ రాహుల్ వెంట పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని వదలకుండా డీకే. శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య వారి వెంట పాదయాత్ర చేస్తున్నారు.

 నడించింది చాలు.... మీరు రండి

నడించింది చాలు.... మీరు రండి

పీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్ డీకే శివకుమార్ కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. డీకే. శివకుమార్ తో పాటు ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు కచ్చితంగా మీరు ఈనెల 7వ తేదీన శుక్రవారం ఢిల్లీలోని కార్యాయానికి వచ్చి విచారణ ఎదుర్కొవాలని సూచించారు.

 టైమ్ అడిగినా ఇవ్వలేదు

టైమ్ అడిగినా ఇవ్వలేదు

వాస్తవానికి డీకే. శివకుమార్ సోదరులకు ఈడీ అధికారులు గత నెల 23వ తేదీన నోటీసులు జారీ చేసి అక్టోబర్ 7వ తేదీన విచారణకు హాజరుకావాలని సూచించారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నానని, విచారకు హాజరుకావడానికి మాకు సమయం కావాలి డీకే. శివకుమార్, ఆయన సోదరుడు డీకే. సురేష్ ఈడీ అధికారులకు లేఖరాశారు.

 సమయం లేదు మిత్రమా..... వచ్చేయండి

సమయం లేదు మిత్రమా..... వచ్చేయండి

డీకే. శివకుమార్ టైమ్ కావాలని అడిగినా ఈడీ అధికారులు మాత్రం మరోసారి నోటీసులు జారీ చేసి కచ్చితంగా శుక్రవారం ఢిల్లీలోకి రావాలని సూచించారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ జోడో యాత్రం జరుగుతున్న సమయంలో, సోనియా గాంధీ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో తనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని డీకే శివకుమార్ ఆరోపించారు.

 రాజకీయ ‘కక్ష' సాధింపు

రాజకీయ ‘కక్ష' సాధింపు

ఢిల్లీ కార్యాలయంలో మమ్మల్ని విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చి రాజకీయ కక్ష సాధింపులు సాగిస్తున్నారని, విచారణకు హాజరుకావడానికి సమయం ఇవ్వాలని మనవి చేసినా ఈడీ అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం మైసూరులోని విమానాశ్రయం దగ్గర మాజీ మంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+