వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈడీ అదికారుల అదుపులో సంజయ్ రౌత్ : వెయ్యి కోట్ల లాండ్ స్కాం..!!

|
Google Oneindia TeluguNews

శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ రౌత్ నివాసం లో ఈ ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదీలు నిర్వహిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం ఒక్కసారిగా భారీ సంఖ్యలో పోలీసులు రౌత్ నివాసానికి చేరుకున్నారు. దీంతో..సంజయ్ రౌత్ ను ఈడీ అరెస్ట్ చేయనుందనే ప్రచరాం సాగింది. అయితే, ఈడీ అధికారులు విచారణ తరువాతో రౌత్ ను తమ అదుపులోకి తీసుకున్నారు. అధికారికంగా అరెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఈడీ అదుపులో రౌత్

ఈడీ అదుపులో రౌత్

ఈడీతో పాటుగా సీఐఎస్ఎఫ్ టీం సైతం రౌత్ ఇంటికి చేరింది. ఆయన పైన పాత్రచాల్ ​భూ కుంభకోణ ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సంజయ్ రౌత్ ను ప్రశ్నిస్తున్నారు. గతంలోనే విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. కానీ, దీనిని రాజకీయ కుట్రగా సంజయ్ రౌత్ రియాక్ట్ అయ్యారు. రాజకీయ కుట్రలో భాగంగానే తన పైన విచారణలు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. తాను ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక, రాజకీయంగానూ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను శివసేన వీడీది లేదని తేల్చి చెప్పారు.

శివసేనలోనే ఉంటా.. పోరాటం చేస్తా

శివసేనలోనే ఉంటా.. పోరాటం చేస్తా


బాలాసాహెబ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నానని..ఆయన నుంచి పొందిన పోరాట స్పూర్తి తనకు ఉందన్నారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తానని రౌత్ స్పష్టం చేసారు. ఈడీ అధికారులు తనను తీసుకెళ్లే ముందు సైతం సంజయ్ రౌత్ శివసేన జెండా ఊపుతూ అభివాదం చేసారు. గతంలో ఈడీ ముందుకు వచ్చిన రౌత్ దాదాపు 10 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు. ఆ తరువాత కూడా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసారు. ఇదే కేసులో ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

ఉదయం నుంచి కొనసాగిన సోదాలు

ఉదయం నుంచి కొనసాగిన సోదాలు


ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల పాత్రచాల్​ భూకుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకున్న తరువాత అధికారికంగా వెల్లడించలేదు. ఆయన అరెస్ట్ చూపించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీని పైన ఉద్దవ్ థాక్రే స్పందన తెలియాల్సి ఉంది.

English summary
Shiv Sena MP Sanjay Raut has been detained by the ED in connection with the Patra chawl scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X