వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

198 గంటలు డీకేని విచారణ చేసిన ఈడీ, తప్పుడు సమాచారం, బెయిల్, సంఘ్వీ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు 198 గంటలు విచారణ చేసి వివరాలు సేకరించారని, ఇంకా ఆయన్ను విచారణ చెయ్యాలని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఈడీ అధికారులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని డీకే న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు.

లక్ష్మీకి అక్రమ మైనింగ్, సోలార్ ప్లాంట్ లింక్, డీకే బినామీ?, ఎన్ని కోట్ల ఆస్తి, క్రిమినల్!లక్ష్మీకి అక్రమ మైనింగ్, సోలార్ ప్లాంట్ లింక్, డీకే బినామీ?, ఎన్ని కోట్ల ఆస్తి, క్రిమినల్!

సాక్షాలు తారుమారు

సాక్షాలు తారుమారు

డీకే. శివకుమార్ బెయిల్ పిటీషన్ పై శనివారం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సండర్బంగా ఈడీ తరపు న్యాయవాది నటరాజ్ కోర్టులో వాదనలు వినింపాచరు. డీకే. శివకుమార్ కేసు విచారణలో ఉందని, ఈ సందర్బంలో ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ మళ్లీ మొదటికి వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

 4 కాదు 198 గంటలు

4 కాదు 198 గంటలు

డీకే. శివకుమార్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ మాట్లాడుతూ 198 గంటల పాటు మా క్లైంట్ ను విచారణ చేసి వివరాలు సేకరించారని, కోర్టులో మాత్రం 4 గంటలు మాత్రమే డీకే. శివకుమార్ ను విచారణ చేసి వివరాలు సేకరించామని ఈడీ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు.

13 రోజులు ఏం చేశారు ?

13 రోజులు ఏం చేశారు ?

13 రోజుల పాటు డీకే శివకుమార్ ను విచారణ చేసిన అధికారులు కేవలం 4 గంటలు మాత్రమే ఆయన్ను ప్రశ్నించామని అంటున్నారు, మిగిలిన అన్ని రోజులు అధికారులు ఏం చేశారు అనే విషయం చెప్పాలని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈడీ అధికారులను ప్రశ్నించారు.

ఊహలు కాదు వాస్తవాలు

ఊహలు కాదు వాస్తవాలు

ఈడీ అధికారులు ఊహల్లో ఉన్నారని, వేరే వ్యక్తుల బ్యాంకు అకౌంట్లు డీకే. శివకుమార్ బ్యాంకు అకౌంట్లు అని చెబుతున్నారని, ఇది నిజం కాదని ఆయన తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఇప్పటికే డీకే శివకుమార్ కు బెయిల్ ఇవ్వాలని మనవి చేశారని, బెయిల్ ఇవ్వాలని అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో మనవి చేశారు.

ఇంకా ఏం సాక్షాలు ఉన్నాయి ?

ఇంకా ఏం సాక్షాలు ఉన్నాయి ?

డీకే. శివకుమార్ ను ఇప్పటికే అరెస్టు చేసి విచారణ చేశారని, ఆయనకు సంబంధించిన అనేక పత్రాలు సీజ్ చేశారని, ఇకా బెయిల్ ఇచ్చినా ఆయన సాక్షాలు తారుమారు చేసే అవకాశం లేదని, దాన్ని సాకుగా పెట్టుకుని ఈడీ అధికారులు బెయిల్ రాకుండా చేస్తున్నారని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

English summary
New Delhi: ED officials spent nearly 198 hours with former minister D.K. Shivakumar has inquired, said DK. Shivakumar's lawyer, Abhishek Manusinghvi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X