వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫెమా ఉల్లంఘనలు: నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సోదాలు చేపట్టింది. విదేశీ మారక చట్టం ఉల్లంఘనలకు పాల్పడిన కేసులో ఈడీ ఈ మేరకు సోదాలు నిర్వహించింది.

విదేశీ మారక చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనల ప్రకారమే తాము ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సంపాదించేందుకే ఈ దాడులు చేసినట్లు చెప్పారు.

ED searches Jet Airways founder Naresh Goyals premises in Delhi, Mumbai

ముంబై, ఢిల్లీలోని నరేశ్ గోయల్ నివాసాలపై దాడులు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్‌వేస్ ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి తన కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాల్లో అవకతవకలు, భారీగా నిధుల మళ్లింపు చోటు చేసుకున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తనిఖీ నివేదికలోనూ వెల్లడైంది. జెట్ ఎయిర్‌వేస్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ లైన్స్ ఛైర్మన్ గా ఉన్న నరేశ్ గోయల్ ఈ ఏడాది మార్చిలో సంస్థ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్ దివాళా ప్రక్రియలో ఉంది.

English summary
The Enforcement Directorate conducted searches on Friday at the premises of Jet Airways founder Naresh Goyal in connection with a case of alleged contravention of the foreign exchange law, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X