ఎయిర్ ఇండియా స్కామ్.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లు

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం చిక్కుల్లో పడ్డారు. యూపీఏ హయాం నాటి కేసు ఆయన్ని వెంటాడుతోంది. అప్పటి ప్రభుత్వంలో ఎయిర్ ఇండియాకు నష్టం కలిగించారనే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నుంచి ఆయన సమన్లు అందుకున్నారు. ఎయిర్ ఇండియా విషయంలో భారీ కుంభకోణంతో పాటు నగదు అక్రమ చలామణీలో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఈ కేసులో దర్యాప్తు కొరకు ఈ నెల 23వ తేదీన ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాలనేది సమన్ల సారాంశం.

ఎయిర్ ఇండియా స్కామ్‌కు సంబంధించి అప్పట్లో విమానయాన శాఖ మంత్రిగా ప్రఫుల్ పటేల్ కొనసాగారు. పి.చిదంబరం ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఇదివరకే ఈ కేసుకు సంబంధించి ప్రఫుల్ పటేల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల నుంచి విచారణ ఎదుర్కొన్నారు. అదే క్రమంలో చిదంబరానికి కూడా సమన్లు జారీ చేశారు అధికారులు. అదలావుంటే ఎయిర్‌సెల్ మ్యాక్సిస్‌తో పాటు ఐఎన్‌ఎక్స్ మీడియా తదితర కేసుల్లోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటుండటం గమనార్హం.

ED summons to P chidambaram in aviation scam

మైనార్టీలకు ఇక పెద్ద దిక్కు బండి సంజయేనా.. ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీకి చెక్..?

ఎయిర్ ఇండియా కోసం 111 ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ను కొనుగోలు చేసింది అప్పటి యూపీఏ ప్రభుత్వం. అయితే ఆ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. వేలాది కోట్ల రూపాయల ఏవియేషన్ స్కామ్ కారణంగా ఎయిర్ ఇండియా నష్టాల్లోకి జారుకుంది. 2008 - 2009 మధ్య కాలంలో కొన్ని విదేశీ ప్రైవేట్ విమాన సంస్థలకు ఎయిర్ స్లాట్స్ కేటాయించడంలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దాంతో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లినట్లు తేలింది. ఆ మేరకు అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+