కోడిగుడ్డు అక్షరాల రూ.25 వేలు..?
సాధారణంగా ఒక కోడిగుడ్డు ధర ఏడు నుంచి పది రూపాయలు ఉంటుంది. నాణ్యమైన గుడ్ల డజను రూ.100 నుంచి రూ.150 మధ్య లభిస్తుంది. అయితే, ఒకే కోడిగుడ్డు ధర ఏకంగా రూ.25 వేలు పలికిందంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నమ్మడం కష్టమే అయినా, ఈ అసాధారణ సంఘటన వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. అసలు అంత భారీ ధర పెట్టడానికి కారణమేంటి? అని జోరుగా చర్చ నడుస్తోంది.
ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ఇరాన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో అష్టకష్టాలు పడుతున్న ఇరాన్ ప్రజలకు సహాయం అందించేందుకు భారతదేశం ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నాయి.

ఇరాన్ ప్రజల కోసం జరుగుతున్న నిధుల సేకరణలో భాగంగా లద్దాఖ్‌లోని లేహ్‌లో ఒక వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఓ కోడిగుడ్డును బహిరంగంగా వేలం వేశారు. ఈ వేలంలో వచ్చిన మొత్తాన్ని ఇరాన్‌కు అందజేస్తామని ప్రకటించారు. అనూహ్యంగా, ఒక వ్యక్తి ఈ విరాళ కార్యక్రమంలో భాగంగా ఆ కోడిగుడ్డును రూ.25 వేలకు కొనుగోలు చేశారు. ఈ సేకరించిన నిధులను ఇరానీయులకు అందజేశారు.












Click it and Unblock the Notifications