భద్రతా సిబ్బందిపై తీవ్రవాదుల పంజా: 8 మంది మృతి
కొహిమా: నాగాలాండ్ లో తీవ్రవాదులు చెలరేగిపోయారు. భద్రతా సిబ్బంది మీద కాల్పులు జరిపి వారిని పొట్టన పెట్టుకున్నారు. ఎదురు కాల్పులు జరిపే సమయానికి తీవ్రవాదులు కాలికి బుద్ది చెప్పారు. తీవ్రవాదుల కోసం అస్సాం రైఫిల్స్ సిబ్బంది గాలిస్తున్నారు.
ఆదివారం నాగాలాండ్ లోని మాన్ జిల్లాలో తీవ్రవాదులు సంచరించారు. అదే సమయంలో భద్రతా సిబ్బంది నీరు తెచ్చుకునేందుకు ట్యాంకర్లు తీసుకుని చంగ్లాన్సు ప్రాంతానికి బయలుదేరారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది కళ్ల గప్పిన తీవ్రవాదులు కాల్పులు జరిపారు.

తీవ్రవాదులు జరిపిన కాల్పులలో అస్సాం రైఫిల్స్ కు చెందిన 7 గురు, ఒక సైనికుడు మరణించారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఒక తీవ్రవాది మరణించాడని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
పలువురు తీవ్రవాదులకు గాయాలైనాయని, వారు సంఘటనా స్థలం నుండి తప్పించుకున్నారని రక్షణ శాఖ వర్గాలు అంటున్నాయి. విషయం తెలుసుకున్న జవాన్లు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది మాన్ జిల్లాలో తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications