దారుణం: కలహాలతో కూతురు తల నరికిన తండ్రి
జమ్మూ/పుణె: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తిన తన ఎనిమిదేళ్ల కూతురును నరికేశాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఆదివారం సాయంత్రం మసరత్ నజ్ అనే బాలిక మారుమూల గ్రామమైన ఘరానా గ్రామంలోని తమ నివాసం బయట విగత జీవిగా పడి ఉందని పోలీసులు తెలిపారు. నరికివేయబడిన ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడైన ఆమె తండ్రి జకీర్ హుస్సేన్‌ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
పుణె ఘటనలో 109కి చేరిన మృతుల సంఖ్య

పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని మాలిన్ గ్రామంలో వారం రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా కొండచరియలు కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 109కి చేరింది. మరో 50 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.
గత బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే ఉన్న మాలిన్ గ్రామాన్ని కొండచరియలు సమాధి చేసిన విషయం తెలిసిందే. కూలిన కొండచరియల కింది నుంచి మృతదేహాలు వెలికితీత ఇంకా కొనసాగుతూనే ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications