సాయంత్రం ఈసీ మీడియా సమావేశం: లోకసభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: ఈ రోజు (ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మీడియా సమావేశం ఉంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటుతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఏడు నుంచి పది విడతల్లో నిర్వహించే అవకాశముంది.
https://www.oneindia.com/lok-sabha-election-2019/
తెలంగాణలోను సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల ముందే, ముందస్తుకు వెళ్లారు. గత ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదశ్ రాష్ట్రానికి లోకసభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.

మరోవైపు, తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి 17 లోకసభ స్థానాలకు గాను 16 స్థానాలపై దృష్టి సారించింది. హైదరాబాద్ మినహా అన్ని స్థానాలు కైవసం చేసుకొని, ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తోంది. ఏపీలో, 25 స్థానాలకు గాను టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ ఉండగా, జనసేన కూడా కీలకం కానుందని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు, చంద్రబాబు పాలన, అనుభవం టీడీపీని గెలిపిస్తాయని తెలుగు తమ్ముళ్లు భావిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. జనసేన కూడా కీలకం కానుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications