సీన్ రివర్స్, పన్నీర్ సెల్వం, శశికళ గ్రూప్ ఎన్నికల గుర్తులు ఇవే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం కోసం ఇన్ని రోజులు పోటీ పడిన పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలకు చేదు అనుభవం ఎదరైయ్యింది. రెండాకుల గుర్తు ఎవ్వరికీ ఇవ్వలేమని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది.

పన్నీర్ సెల్వం వర్గానికి ఎన్నికల కమిషన్ ల్యాంప్ గుర్తు కేటాయించింది. అదే విధంగా అమ్మ ఏఐఏడీఎంకే పార్టీ పేరు పెట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇక శశికళ వర్గానికి ఆటో రిక్షా గుర్తును కేటాయించామని ఎన్నికల కమిషన్ తెలిపింది.

Election commission gives OPS team party name is Amma AIADMK

తాము ఏఐఏడీఎంకే అమ్మ పార్టీ పేరుతో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని శశికళ వర్గం అంటోంది. ఇక జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరుతో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు.

మొత్తం మీద ఆర్ కే నగర్ -2017 ఉప ఎన్నికల్లో స్థానిక కార్యకర్తలు ఏ వర్గానికి మద్దతు ఇచ్చి గెలిపిస్తారో అంటూ టెన్షన్ మొదలైయ్యింది. అమ్మ అభిమానులు మూడు ముక్కలుగా చీలిపోతారా ? అనే విషయంపై అంతుపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Election commission gives O. Panneerselvam team party name is Amma ADMK.
Please Wait while comments are loading...