బాహుబలి ప్రభాస్‌ స్టంట్: ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడు(వీడియో)

Subscribe to Oneindia Telugu
Baahubali stunt fails : ఏనుగుపై బాహుబలి స్టంట్‌ ట్రై చేసాడు, చివరికి ఇలా ?

తిరువనంతపురం: సినిమాల్లో హీరోల స్టంట్లను చూసి.. నిజ జీవితంలోను వాటిని అనుసరించే అభిమానులు చాలామందే ఉంటారు. కానీ స్టంట్ ఏమాత్రం తేడా కొట్టినా.. ప్రాణాల మీదకు రావడం ఖాయం.

తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు కూడా ఇదే తరహాల విఫలయత్నం చేశాడు. బాహుబలి-2 సినిమాలో మాదిరి ఏనుగు పైకి ఎక్కాలనుకునున్నాడు. వీడియో తీయమని తన స్నేహితుడికి చెప్పి ఏనుగు వద్దకు వెళ్లాడు. మొదట ఓ అరటిపండు తీసి దానికి తినిపించాడు.

Elephant hits man in kerala

ఆపై తొండంపై సుతారంగా నిమిరి ముద్దుపెట్టాడు. ఏనుగు ఏమి అనకపోవడంతో.. మరో అడుగు ముందుకేసి దంతాలను పట్టుకుని పైకి ఎక్కబోయాడు. అంతే, తొండంతో ఒక్కసారిగా అతన్ని విసిరిపారేసింది. వెంటనే తేరుకున్న స్నేహితుడు.. అతన్ని ఆసుపత్రికి తరలించాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేరళలోని తిరువనంతపురం దగ్గర్లోని ఇడుక్కి థోడుపూఝాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man tried the stunt like Bahubali Prabhas and failed, now he was getting treatment in hospital due to the injuries by Elephant
Please Wait while comments are loading...