Archimedes Principle:బావిలో గున్న ఏనుగు.. గ్రామస్తులు కాపాడిన తీరు భేష్..వీడియో వైరల్

Recommended Video

    Viral Video: Archimedes Principle Used to Rescue Elephant Stuck In Well | Oneindia Telugu

    జార్ఖండ్: ఈ మధ్య కాలంలో గజరాజుల వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఏనుగు ఒక రెస్టారెంట్‌లోకి ప్రవేశించి అక్కడి సామాన్లను ధ్వంసం చేసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అంతకంటే ముందు బెంగాల్‌లో మరో ఏనుగు రైల్వే గేటును పైకెత్తి చాలా తెలివిగా పట్టాలను దాటిన వీడియో వైరల్ అయ్యింది. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వార్తే సోషల్ మీడియాను చుట్టేస్తోంది. అంతేకాదు అది ప్రాణాలతో ఎలా బయటపడిందనేది మరింత ఆసక్తికరంగా మారింది.

     బావిలో పడిపోయిన గున్న ఏనుగు

    బావిలో పడిపోయిన గున్న ఏనుగు

    జార్ఖండ్‌లో ఓ గున్న ఏనుగు దారి తప్పింది. మంద నుంచి తప్పిపోయిన ఈ పిల్ల ఏనుగు ఓ పాతబడ్డ బావిలోకి పడిపోయింది. పాపం ఏం చేయాలో తెలియలేదు. బయటకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఇక తనకు ఎవరైనా సహాయం చేస్తేబాగుంటుందని భావించి ఘీంకరించడం మొదలు పెట్టింది. ఈ ఘటన గుమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న ఆ ఏనుగు ఘీంకరించడంతో భగవంతుడు కనికరించాడు. అటుగా వెళుతున్న గ్రామస్తులు ఏనుగు కేకలను విని బావివైపు వెళ్లారు. బావిలో నిస్సహాయ స్థితిలో ఉన్న గున్న ఏనుగును చూసిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఏనుగును బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

     ఆర్కిమిడ్ సిద్ధాంతం ప్రయోగం

    ఆర్కిమిడ్ సిద్ధాంతం ప్రయోగం

    బావిలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చాలా సేపు ప్రయత్నించి విఫలమయ్యారు అధికారులు. అది బయటకు వచ్చినట్లే వచ్చి మళ్లీ బావిలోకి తిరిగి జారుకుంది. ఇలా పలు ప్రయత్నాలు విఫలమయ్యాక చివరి ప్రయత్నం చేశారు అధికారులు. వెంటనే అప్పుడెప్పుడో నేర్చుకున్న ఆర్కిమిడ్ సిద్ధాంతంను ప్రయోగించారు. ముందుగా బావిలోకి నీరును వదిలితే ఏనుగు తేలియాడుతుందని దీంతో దాన్ని బయటకు తీసుకురావడం చాలా సులభం అవుతుందని అధికారులు భావించారు. ఇక ఆపరేషన్ మొదలు పెట్టారు.

    నీటిని నింపి ఏనుగు తేలేలా చేసిన గ్రామస్తులు

    ముందుగా బావిలోకి నీరును వదిలారు. అనుకున్నట్లుగానే నీరు ఒక దశకు చేరుకున్న తర్వాత గున్న ఏనుగు నీటిపూ తేలియాడింది. నీరు క్రమంగా పెరిగే కొద్ది ఏనుగు కూడా పైకి తేలుతూ వచ్చింది. ఆపై ఏనుగును బయటకు తీసుకొచ్చారు. ప్రాణాలతో బయటపడ్డ ఏనుగు బతుకు జీవుడా అంటూ అడవిలోకి పరుగులు తీసింది. దీన్నంతటినీ వీడియోలో రికార్డు చేశారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్టు ఆఫీసర్ రమేష్ పాండే ట్విటర్‌లో పోస్టు చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆర్కిమిడ్ సిద్ధాంతంను ప్రయోగించి ఒక ప్రాణి జీవితాన్ని కాపాడిన అటవీ అధికారులను గ్రామస్తులను రమేష్ పాండే అభినందించారు.

     సైన్స్ అద్భుతం.. విద్యార్థులకు ఈ వీడియో చూపించాలి

    సైన్స్ అద్భుతం.. విద్యార్థులకు ఈ వీడియో చూపించాలి

    ఇక నెటిజెన్లు కూడా ఈ వీడియోను చూసి అభినందించడమే కాదు తమదైన శైలిలో కామెంట్ రాసుకొచ్చారు. ఓ మూగజీవిని కాపాడిన తీరు అద్భుతం అని ప్రశంసిస్తూ ఆ సమయంలో వీరికి ఆర్కిమిడ్స్ సిద్ధాంతం గుర్తుకురావడం నిజంగా అభినందనీయం అని రాసుకొచ్చారు. సైన్స్ ఒక అద్భుతమని ఫిజిక్స్ పాఠాలు చెప్పేసమయంలో ఈ వీడియోను విద్యార్థులకు చూపి ఆర్కిమిడ్ సిద్ధాంతంకు సరైన ఉదాహరణగా చెప్పాలని కొందరు రాసుకొచ్చారు. ఇలా చేయడం వల్ల సైన్స్‌తో పాటు జంతువులను కూడా ప్రేమించడం విద్యార్థులు నేర్చుకుంటారని మరో ట్విటర్ యూజర్ కామెంట్ రాశాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+