నీరజ్ చోప్రా, మిథాలి రాజ్ సహా 11 మంది పేర్లు ఖేల్ రత్న పురస్కారానికి సిఫారసు - Newsreel

నీరజ్ చోప్రా, మిథాలి రాజ్ సహా 11 మంది పేర్లను జాతీయ క్రీడా పురస్కారాల కమిటీ 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డులకు సిఫారసు చేసింది.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రా సహా 11 మంది పేర్లను కమిటీ ఈ అవార్డుల కోసం సిఫారసు చేసినట్లు వార్తా ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది.
https://twitter.com/PTI_News/status/1453329128699023366
రెజ్లర్ రవి దహియా, బాక్సర్ లవ్లీనా, ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి, మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, హాకీ ఆటగాడు పి.శ్రీజేశ్ ఈ జాబితాలో ఉన్నారు. షూటర్ అవని లక్రా సహా అయిదుగురు పారా అథ్లెట్లకూ ఖేల్ రత్న అవార్డు ప్రకటించారు.
క్రికెటర్ శిఖర్ ధావన్ సహా 35 మందికి అర్జున అవార్డు ప్రకటించినట్లు పీటీఐ వెల్లడించింది.
https://twitter.com/PTI_News/status/1453330143443709957
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైంది వీరే
1) నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్)
2) రవి దహియా (రెజ్లింగ్)
3) పీఆర్ శ్రీజేశ్ (హాకీ)
4) లవ్లీనా (బాక్సింగ్)
5) సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్)
6) మిథాలి రాజ్ (క్రికెట్)
7) ప్రమోద్ భగత్(బ్యాడ్మింటన్)
8) సుమిత్ అంటిల్ (జావెలిన్)
9) అవని లేఖరా (షూటింగ్)
10) కృష్ణ నగర్(బ్యాడ్మింటన్)
11) ఎం.నర్వాల్(షూటింగ్)
ఇవి కూడా చదవండి:
- ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమాధానాలు దొరకని 5 కీలకమైన ప్రశ్నలు
- రాజ కుటుంబాన్ని కోట్ల సంపదను వదులుకుని 'సామాన్యుడిని' ప్రేమించి పెళ్లాడిన జపాన్ రాజకుమారి
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- 'ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications