
ఫోర్బ్స్ కుబేరులలో పడిలేచిన ఎలాన్ మస్క్; మూడోస్థానంలో గౌతమ్ అదానీ, 8వస్థానంలో ముఖేష్ అంబానీ!!
ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ సారి ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ రెండో స్థానానికి వెళ్ళినట్టే వెళ్లి మళ్ళీ తన మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. మళ్ళీ ప్రపంచ సంపన్నుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు.

మొదటి స్థానానికి దూసుకొచ్చిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ
ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ జాబితాలో ఊహించని విధంగా ఎలాన్ మస్క్ రెండవ స్థానానికి పడిపోయారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో నుండి అగ్రస్థానాన్ని కోల్పోయారు. టెస్లా షేర్లు క్షీణించడం తో పాటు ట్విట్టర్లో 44 బిలియన్ డాలర్ల పెట్టుబడి కారణంగా ఎలాన్ మస్క్ నికర విలువ బాగా పడిపోయింది. దీంతో ఓ దశలో మొదటి స్థానం లోకి లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్తన్ మాతృసంస్థ ఎల్వీఎంహెచ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ దూసుకొచ్చింది.

గంటల వ్యవధిలోనే మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఎలాన్ మస్క్
ఫ్రెంచ్ వ్యాపారవేత్త అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫోర్బ్స్ జాబితాలో 185.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచారు. అయితే మళ్లీ వ్యక్తిగత సంపదను పెంచుకుని నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న మస్క్ గంటల వ్యవధిలోనే అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద 185.7 బిలియన్ డాలర్లు . ఎలాన్ మస్క్ సెప్టెంబర్ 2021 నుండి అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను పక్కకునెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

ట్విట్టర్ పెట్టుబడులు, టెస్లా షేర్లు క్షీణత కారణంగా పడిపోయిన మస్క్ విలువ
2022
వ
సంవత్సరంలో
టెస్లా
షేర్లు
రెండేళ్లలో
కనిష్ఠ
స్థాయికి
పడిపోయిన
కారణంగా
ఎలాన్
మస్క్
నికర
విలువ
ఇప్పటికి
200
బిలియన్
డాలర్లకు
పైగా
పడిపోయింది.
ఎలక్ట్రిక్-కార్
తయారీదారు
తన
సంపదలో
ఎక్కువ
భాగాన్ని
కలిగి
ఉన్నాడు.
యుఎస్
వెలుపల
అతిపెద్ద
మార్కెట్
అయిన
చైనాలో
కోవిడ్-సంబంధిత
ఆంక్షలతో
పోరాడుతున్నాడు.
ఇక
ట్విట్టర్
లో
పెట్టుబడుల
కారణంగా
ఆయన
స్థానం
ఒక్కసారిగా
పడిపోయింది.

బుధవారం మొదటి స్థానంలో కొన్నిగంటల పాటు ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్
బుధవారం నాడు మధ్యాహ్నం ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎలాన్ మస్క్ ను అధిగమించి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు. మస్క్ 100 మిలియన్ డాలర్లతో వెనకబడి రెండవ స్థానంలో నిలిచారు. అయితే సాయంత్రం యూఎస్ మార్కెట్లు ముగిసే సమయానికి అది మారిపోయింది . మస్క్ 185.4 మిలియన్ డాలర్లతో మళ్లీ తన ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు.

మళ్ళీ మొదటి స్థానం మస్క్ దే .. భారత కుబేరులు ఈ స్థానాల్లో
14 నెలలుగా ప్రపంచ కుబేరుల మొదటి స్థానంలో నిలిచిన మస్క్ ఒక్కసారిగా రెండవ స్థానానికి వెళ్లడం, మళ్లీ గంటల వ్యవధిలోనే రెండో స్థానం నుండి మొదటి స్థానానికి రావడం చకచకా జరిగిపోయాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో భారత్ కు చెందిన గౌతమ్ అదాని కొనసాగుతున్నారు. అంతకు ముందు టాప్ పొజీషన్ లో ఉన్న జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో ఉండగా వారెన్ బఫెట్ ఐదో స్థానంలో నిలిచారు. ఇక భారత దేశానికి చెందిన మరో వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు.
ఫోర్బ్స్
2022
జాబితా:
వరుసగా
నాలుగోసారి
శక్తివంతమైన
మహిళగా
నిర్మలా
సీతారామన్!!