మోదీ ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో కొట్టిన ఎలాన్ మస్క్
వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను ఆయన ఫాలో అవుతోండటమే దీనికి కారణం. మోదీ ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో చేస్తోన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు.. భారత్‌లో టెస్లా కార్ల తయారీ యూనిట్‌కు లైన్ క్లియర్ అయ్యాయనే సంకేతాలను పంపించినట్టయింది.
ట్విట్టర్ అధినేతగా ఎలాన్ మస్క్ 194 మందిని ఫాలో అవుతోన్నారు. వారిలో బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో ప్రధాని మోదీ చేరారు. ఎలాన్ మస్క్ ఫాలో అవుతున్న వారిలో ఈ స్థాయి వ్యక్తులు గానీ, జాతీయ నాయకులు గానీ మరొకరు లేరు.

ట్విట్టర్‌కు సంబంధించిన అన్ని అధికారిక అకౌంట్లను మస్క్ ఫాలో అవుతున్నారు. యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్, స్టాన్‌ఫొర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ జై భట్టాచార్య, బీబీసీ, బీబీసీ సైన్స్ న్యూస్, నాసా, నాసా వెబ్ టెలిస్కోప్, స్పేస్ ఎక్స్, ఖాన్ అకాడమీ, హైపర్ లూప్, కొన్ని అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన అకౌంట్లను ఎలాన్ మస్క్ ఫాలో అవుతున్నారు.
ఎలాన్ మస్క్‌ను ఫాలో అవుతోన్న వారి సంఖ్య మాత్రం భారీగా ఉంటోంది. 134.3 మిలియన్ల మంది ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌పై మస్క్‌ను ఫాలో అవుతున్నారు. ఈ విషయంలో ఆయనే టాపర్. మోదీ ట్విట్టర్ అకౌంట్‌ను 87.7 మిలియన్ల మంది యూజర్లు అనుసరిస్తోన్నారు. భారత్‌లో టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ఎలాన్ మస్క్ గతంలో ప్రయత్నాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించడానికి ఆయన ఇష్టపడలేదు. భారత్‌లో కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పిన తరువాతే అమ్మకాలు చేపట్టాలంటూ కేంద్రం షరతు పెట్టింది. దీన్ని వ్యతిరేకించారాయన అప్పట్లో. ప్రస్తుతం చైనా సహా ఇతర దేశాల్లో తయారవుతోన్న కార్లను భారత్‌లో దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇస్తేనే యూనిట్ నెలకొల్పుతానని ప్రకటించారు. దీనితో పాటు ప్రపంచంలో ఎక్కడా లేన విధంగా భారత్‌లోనే దిగుమతి పన్నులు భారీగా ఉన్నాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications