వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లాస్‌మేట్‌ను క్లాస్‌ రూమ్‌లోనే కాల్చి చంపిన పదో తరగతి విద్యార్థి: హత్యకు ఆర్మీ గన్

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. యుక్త వయస్సులో ఉన్న పిల్లల్లో నేర ప్రవృత్తి ఏ రకంగా పెరిగిపోతోందోననడానికి సాక్ష్యంగా నిలిచింది. 14 ఏళ్ల వయస్సులోనే ఓ విద్యార్థి.. తన క్లాస్‌మేట్‌ను కాల్చి చంపాడు. అతనిపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు. కాల్చి చంపేంతంటి పగ వారి మధ్య లేదు. ఓ చిన్న తగాదా ఈ దారుణ ఘటనకు కారణమైంది. ఉత్తర ప్రదేశ్ బులంద్‌షహర్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మిస్ ఇండియా గ్లోబల్ ఆషిమా నర్వాల్ కిల్లింగ్ లుక్ ఫొటోలు

క్లాస్‌రూమ్‌లో వారి మధ్య సంభవించిన ఘర్షణ.. కాల్పులకు దారి తీసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు బులంద్‌షహర్‌లోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం తోటి విద్యార్థి అతనితో ఘర్షణకు దిగాడు. సీటు కోటు కోసం వారిద్దరు గొడవ పడ్డారు. ఘర్షణకు దిగిన విద్యార్థి ఈ ఉదయం తన మామయ్యకు చెందిన తుపాకీతో స్కూల్‌కు వెళ్లాడు. క్లాస్‌రూమ్‌లో మరోసారి అతనితో ఘర్షణ పడ్డాడు. అందరి ముందు తనకు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టాడు.

దీనికి అతని క్లాస్‌మేట్ అంగీకరించలేదు. దీనితో ఆగ్రహానికి గురైన నిందితుడు.. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. మూడుసార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వారిద్దరి వయస్సు 14 సంవత్సరాలే. నిందితుడి బ్యాగులో మరో నాటు తుపాకీ కూడా పోలీసులు గుర్తించారు. అతనికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీశారు. నిందితుడి మేనమామ ఆర్మీలో పనిచేస్తున్నట్లు తేలింది.

అల.. వైకుంఠపురములో హీరోయిన్ నివేదా పేతురాజ్‌ను ఇలా ఎప్పుడూ చూసుండరు

ప్రస్తుతం అతను సెలవుపై ఇంటికి వచ్చాడు. అతని లైసెన్స్‌డ్‌ తుపాకీని కాల్పులకు వినియోగించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నామని బులంద్‌షహర్ డీఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల, ఛాతీ, కడుపులో బుల్లెట్లు దూసుకెళ్లినట్లు నిర్ధారించారు.

English summary
Classroom fight over seats turned deadly in Uttar Pradesh's Bulandshahr district when one Class 10 student shot dead another, the police said on Thursday. According to the police, the two boys - both aged 14 - fought over seats in the class on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X