వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఉద్యోగస్తులకు ఏమేరకు లాభాలుంటాయి..?

|
Google Oneindia TeluguNews

దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వారి విధానాలు ఎలా ఉంటాయో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో వారు కట్టే ఆదాయపు పన్ను శాఖపై చర్చ జరుగుతోంది. జూలై 5న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో టాక్స్‌ విధానాలపై ఎలాంటి ప్రకటన చేస్తారో అన్న ఆశ ఉద్యోగస్తుల్లో నెలకొంది. అయితే వ్యక్తిగత రేట్లలో చాలా మంది మరొకసారి ఆదాయపు పన్నుపై రివిజన్ జరగాలని కోరుకుంటున్నారు.

ఉద్యోగస్తులు బడ్జెట్‌లో ఏమి కోరుతున్నారు..?

ఉద్యోగస్తులు బడ్జెట్‌లో ఏమి కోరుతున్నారు..?

ఆదాయపు పన్ను శాఖలో రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగస్తులు కొత్త ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరుకుంటున్నారు. సెక్షన్ 80సీ కింద వచ్చే మినహాయింపులకు సంబంధించిన అంశాలను మరిన్ని చేర్చాలని మరికొందరు ఉద్యోగస్తులు కోరుతున్నారు. అయితే ఆదాయపుపన్నుకు సంబంధించి మరిన్ని మార్పులు చేర్పులను చేయడం నిర్మలా సీతారామన్‌కు సాధ్యమవుతుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

నిపుణుల మాట ఏమిటి..?

నిపుణుల మాట ఏమిటి..?

ఏడాదికి రూ. 5 లక్షలు ఆదాయం ఉన్న వారికి గత చివరి బడ్జెట్‌లో సెక్షన్ 87ఏ కింద పూర్తి టాక్స్ రిబేట్‌ను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ బడ్జెట్‌లో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇచ్చే అవకాశం లేదని ఇన్‌కంటాక్స్ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సున్నా పన్ను కిందకు వచ్చినప్పటికి కూడా వారు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఫైల్ చేయాల్సిందే. ఒకవేళ రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారికి కేంద్రం మినహాయింపు ఇవ్వాలంటే చివరి మధ్యంతర బడ్జెట్‌కు అర్థం ఉండదని వారు చెబుతున్నారు. అయితే ట్యాక్స్ కట్టేవారికి అన్ని మినహాయింపులు కల్పించాలనే దానిపై మోడీ సర్కార్ ఫోకస్ చేస్తున్నప్పటికీ ఈ తరహా నిర్ణయం మంచిది కాదని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌కంట్యాక్స్‌పై కేంద్రం ప్రకటన ఎలా ఉండబోతోంది..?

ఇన్‌కంట్యాక్స్‌పై కేంద్రం ప్రకటన ఎలా ఉండబోతోంది..?


ప్రస్తుతం రూ.10 లక్షలు ఆదాయం ఉన్నవారికి 20శాతం పన్ను విధిస్తుండగా దాన్ని 10శాతానికి సవరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేమాదిరిగా రూ.10 లక్షల నుంచి 15 లక్షలు ఉన్న వారి ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రస్తుతం ఉన్న 30శాతం నుంచి 20శాతానికి చేర్చాలని నిపుణులు చెబుతున్నారు. దేశాభివృద్ధికి తోడ్పడేందుకు ప్రభుత్వం టాక్స్ పేయర్స్‌పై దృష్టి సారించింది. వారికి మంచి ఫలాలు ఇస్తూనే అదే సమయంలో పన్ను కూడా సకాలంలో కట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ బెనిఫిట్స్‌పై తొలిబడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయకపోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

English summary
Expectations are soaring among Indian taxpayers, who are eagerly awaiting new finance minister Nirmala Sitharaman's maiden budget speech on July 5. Most of the taxpayers are hoping for further revision in income tax slabs and individual rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X