ఎన్‌కౌంటర్: ఇద్దరు జవాన్లు మృతి, నలుగురికి గాయాలు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో నలుగురు జవాన్లతో పాటు ఇద్దరు పౌరులు గాయపడ్డారు. కోకెర్‌నాగ్ ప్రాంతంలోని అహ్లాన్ గగర్‌మండు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆర్మీ అధికారులు కార్డన్ సెర్చ్ చేపట్టారు.

ఈ క్రమంలో అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు ఆర్మీ సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, వారిలో ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులు పారిపోయారని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Encounter in AnantNag two soldiers martyred four injured

'కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా, నిర్విరామంగా, నిర్లక్ష్యపూరితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు పౌరులు కూడా గాయపడ్డారు. వారికి తక్షణ వైద్య సహాయం ఆస్పత్రికి తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అహ్లాన్ గడోల్ అడవుల్లో వేళ్లూనుకున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆ ప్రాంతానికి బలగాలను తరలించారు.

గత ఏడాది కాలంలో కోకెర్‌నాగ్‌లో జరిగిన రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్ నేటిదే కావడం గమనార్హం. సెప్టెంబరు 2023లో, కోకెర్‌నాగ్ అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో మరణించిన సిబ్బందిలో కమాండింగ్ ఆఫీసర్, మేజర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+