మరో భారీ ఎన్ కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి, ముగ్గురు జవాన్లకు గాయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో శుక్రవారం మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.ఏప్రిల్ 30న నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మరణించారు. ఇక శుక్రవారం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు మరణించగా.. ముగ్గురు జవాన్లు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఓర్చా ప్రాంతంలోని గోబెల్ గ్రామ సమీపంలోని అడవిలో ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు.

ఉమ్మడి నక్సలైట్ వ్యతిరేక బృందం ఆపరేషన్‌లో భద్రతా బలగాలు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన పోలీసుల జిల్లా రిజర్వ్ గార్డ్‌కు చెందిన సిబ్బంది, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ 45వ బెటాలియన్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.
కాల్పుల తర్వాత ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు, కొన్ని ఆయుధాలు సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సదరు అధికారి చెప్పారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. తాజా ఎదురు కాల్పుల ఘటనతో ఏడాదిలో జరిగిన మొత్తం ఎన్‌కౌంటర్లలో 122 మంది నక్సలైట్లు మృతి చెందారు.












Click it and Unblock the Notifications