వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనీలాండరింగ్ కేసులో పీఎఫ్ఐ ఖాతాలను అటాచ్ చేసిన ఈడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/తిరువనంతపురం: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), రిహాబ్ ఇండియా ఫౌండేషన్ అనే అనుబంధ సంస్థకు చెందిన కనీసం 33 బ్యాంక్ ఖాతాలను వారిపై మనీలాండరింగ్ నిరోధక విచారణలో భాగంగా అటాచ్ చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

కాగా, ఈ ఖాతాలు ₹68 లక్షల కంటే ఎక్కువ మొత్తం కలిగి ఉన్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Enforcement Directorate attaches PFI accounts in money laundering case

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన 23 ఖాతాలు ₹59,12,051, రిహాబ్ ఇండియా ఫౌండేషన్‌కు చెందిన 10 ఖాతాలు ₹9,50,030 అటాచ్ చేసినట్లు వారు తెలిపారు.

ఇస్లామిస్ట్ సంస్థ కేరళలో 2006లో స్థాపించబడింది. ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉంది.

కాగా, మే నెల ప్రారంభంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇద్దరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) నాయకులు అబ్దుల్ రజాక్ పీడియాక్కల్ అలియాస్ అబ్దుల్ రజాక్ బిపి, అష్రఫ్ ఖాదిర్ అలియాస్ అష్రఫ్ ఎంకెపై రూ. 22 కోట్ల మనీలాండరింగ్ కేసు (ఛార్జ్ షీట్ లాగానే) దాఖలు చేసింది. ఇద్దరూ కేరళకు చెందిన పీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు.

ఛార్జ్ షీట్ ప్రకారం పీఎఫ్ఐ ఈ నాయకులు కేరళలోని మున్నార్‌లో విదేశాలలో సంపాదించిన డబ్బును లాండరింగ్ చేయడానికి, సంస్థ "రాడికల్ కార్యకలాపాలకు" మద్దతు ఇవ్వడానికి వ్యాపారాన్ని స్థాపించారు. పీఎఫ్ఐ చేత ఉద్దేశించిన "ఉగ్రవాద సమూహం" ఏర్పాటులో ఈ నాయకులు పాల్గొన్నారని కూడా పేర్కొన్నారు.

English summary
Enforcement Directorate attaches PFI accounts in money laundering case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X