వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు సహా 5 భాషల్లో ఇంజినీరింగ్ బోధన: నూతన విద్యావిధానంపై మోడీ కీలక ప్రసంగం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత చేరువ చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇందులో భాగంగానే ఇంజినీరింగ్ కోర్సులున తెలుగుతోపాటు ఐదు భాషల్లో బోధించనున్నట్లు వెల్లడించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యా బోధన ఐదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం ఆనందంగా ఉందన్నారు.

తెలుగు సహా ఐదు భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు

తెలుగు సహా ఐదు భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు

నూతన జాతీయ విధానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు గడిచిన ఏడాదిగా టీచర్లు, ప్రిన్సిపాల్, మేధావులు, దేశపు చట్టసభల సభ్యులు ఎంతో కృషి చేశారని మోడీ చెప్పారు.

దేశ యువతకు అండగా నూతన విద్యా విధానం..

దేశ యువతకు అండగా నూతన విద్యా విధానం..


ఇంజినీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో విద్యనభ్యసించబోతున్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ దేశ యువత ఆశయాలకు నూతన విద్యావిధానం అండగా ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కొత్త విద్యా విధానం దోహదపడుతుందని, దీంతో యువత తమ కలలను సాకారం చేసుకునే విషయంలో స్వయంగా ముందుకెళ్లగలరని ప్రధాని ఆకాంక్షించారు.

కరోనా మహమ్మారి పరిస్థితిని మార్చేసినా..

కరోనా మహమ్మారి పరిస్థితిని మార్చేసినా..

మొత్తం పరిస్థితులను కరోనావైరస్ మహమ్మారి మార్చేసినప్పటికీ.. విద్యార్థులు ఆన్‌లైన్‌లో విద్యా బోధనను త్వరగా అలవాటు చేసుకున్నారన్నారు. ఒకప్పుడు మన విద్యార్థులు పైచదువులకు విదేశాలకు వెళ్లేవారని, కానీ, త్వరలో దేశంలోనే ప్రపంచ స్థాయి విద్యను అందుకునే సదుపాయం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్క రంగంలో తమ సత్తా చాటేందుకు భారతీయ యువత ముందుకెళ్తోందన్నారు.

Recommended Video

G7 Summit : China Warned G7 Leader | Oneindia Telugu
డిజిటల్ ఇండియాకు కొత్త రెక్కలు

డిజిటల్ ఇండియాకు కొత్త రెక్కలు


నూతన విద్యా విధానంలో మాతృభాషల్లో విద్యను అందించడం అత్యంత కీలకమని, కొత్త విద్యా విధానం యువత కలలను సాకారం చేసే దిశగా చేయూతనిస్తుందన్నారు. విద్యార్థుల్లో ఉండే అనవసర ఒత్తిడిని దూరం చేస్తుందని, కొత్త విప్లవాన్ని తీసుకొస్తుందన్నారు. ఈ విద్యా విధానం విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకునేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. యువతకు భవిష్యత్తు ఆధారిత కలలను సాకారం చేసే విద్య అవసరమన్నారు. ఇండియన్ స్టార్టప్ ఎకో సిస్టమ్‌ని విప్లవాత్మకమైనదిగా చేస్తున్నారని తెలిపారు. డిజిటల్ మీడియాకు కొత్త రెక్కలు ఇస్తున్నారన్నారు. ఇండస్ట్రీ 4.oకి భారత నాయకత్వం ఇచ్చేందుకు యువత సిద్ధమవుతుందని ప్రధాని మోడీ తెలిపారు.

English summary
Engineering Courses Will Be Taught In 5 Languages including Telugu: PM Modi on new education policy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X