Mind Block: మొన్న కొడుకుతో, నిన్న తండ్రితో లేడీ పెళ్లి, నా మాజీ భార్య నాకు ఏమౌతుంది ?, మీరే చెప్పండి !
లక్నో/చెన్నై: మారుతున్న టెక్నాలజీని మనోళ్లు బాగా ఫాలో అవుతున్నారో ? ఏమో ? తెలీదు కాని విదేశాల సంస్కృతిని మస్త్ ఫాలో అయిపోతున్నారని వెలుగు చూస్తోంది. తన మాజీ భార్య ఇప్పుడు తనకు పిన్ని అని తెలుసుకున్న యువకుడి మైండ్ బ్లాక్ అయ్యింది. మొదట కొడుకును పెళ్లి చేసుకున్న అమ్మాయి కొంతకాలం అతనితో కాపురం చేసింది. భర్త తీరుతో విసిగిపోయిన భార్య అతనికి విడాకులు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యింది. భర్తకు విడాకులు ఇవ్వకుండానే అదే భర్తకు తండ్రి అయిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న భార్య మామతో చక్కగా కాపురం చేస్తోంది. తండ్రి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని కొడుకు ఆర్ టీఐ చట్టం కింద తండ్రి గురించి ఆరా తీసి అసలు విషయం తెలుకుని లబోదిబో అంటున్నాడు. నిన్న నా భార్యగా ఉన్న మహిళ ఇప్పుడు నాకు పిన్ని అయ్యి నా కొంప ముంచేసిందని మాజీ భర్త పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.

తండ్రి కోసం గాలించిన కొడుకు
ఉత్తరప్రదేశ్ లోని బడాన్ లో నివాసం ఉంటున్న రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు అతని తండ్రి రామ్ సింగ్ (పేరు మార్చడం జరిగింది) తనకు డబ్బులు ఇవ్వకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయి ఎక్కడా కంటికి కనపడకుండా పోవడంతో ఆందోళన చెందాడు. చాలా కాలం తండ్రి రామ్ సింగ్ (48) కోసం వెతికిన కొడుకు రాజేష్ కు ఒక ఆలోచన వచ్చింది. తండ్రి రామ్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆర్ టీఐ సమాచారం కింద తండ్రి ఆచూకి తెలుసుకోవాలని ప్రయత్నించాడు.

దెబ్బకు మైండ్ బ్లాక్
రామ్ సింగ్ జిల్లా పంచాయితీలో పారిశుద్ద కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. రామ్ సింగ్ రెండో పెళ్లి చేసుకున్నాడని, సంబల్ ప్రాంతంలో అతను సంతోషంగా జీవిస్తున్నాడని జిల్లా పంచాయితీ కార్యాలయం సిబ్బంది కొడుకు రాజేష్ వేసిన ఆర్ టీఐ అర్జీకి సమాధానం ఇచ్చారు. తండ్రి రామ్ సింగ్ పెళ్లి చేసుకున్నది తన మాజీ భార్య అని తెలుసుకున్న రాజేష్ మైండ్ బ్లాక్ అయ్యింది.

మైనర్ల పెళ్లి చట్టవ్యతిరేకం
2016లో రాజేష్ కు పింకీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగే సమయానికి రాజేష్, పింకీ ఇద్దరు మైనర్లు. పింకీని పెళ్లి చేసుకున్న రాజేష్ రోజూ మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ భార్యను పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు. తనకు భర్త వద్దని, విడాకులు కావాలని, మైనర్లకు పెళ్లి చెయ్యడం నేరమని అప్పట్లో పింకీ పెద్ద గొడవ చేసిందని సమాచారం.

విడాకులు కావాలన్న భార్య
పెద్దలు పంచాయితీలు చేసి కొంతకాలం రాజేష్, పింకీలను కలిసి కాపురం చేయించడానికి ప్రయత్నించారు. అయితే రాజేష్ ఏమాత్రం మారకుండా మద్యం మత్తులో మునిగితేలిపోయాడు. చివరికి విసిగిపోయిన పెద్దలు మీ చావు మీరు చావండి అంటు వదిలేశారు. భర్త రాజేష్ తో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిన పింకీ ఆమె దారి ఆమె చూసుకుంది.

కొడుకు పోయాడు..... మామ మొగుడైనాడు
రాజేష్ తో విడాకులు తీసుకోకుండానే పింకీ ఆమె భర్త తండ్రి రామ్ సింగ్ ను రెండో పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేస్తోంది. రాజేష్ తండ్రి రామ్ సింగ్, అతనికి దూరం అయిన మాజీ భార్య పింకీ మీద బిసౌలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. పోలీసులు రామ్ సింగ్, అతని రెండో భార్య పింకీని, కేసు పెట్టిన రాజేష్ ను పిలిపించి విచారణ చేశారు.

నాకు పెళ్లాం అవుతందా పిన్నీ అవుతుందా ? మరేమౌతుంది
తనను వదిలేసి వెళ్లిపోయిన భార్య పంకీతో తాను కాపురం చేస్తానని, తనను మోసం చేసి తన తండ్రి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడని రాజేష్ పెద్ద గొడవ చేశాడు. నువ్వు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిన తరువాత నేను పెళ్లి చేసుకున్నానని, నీ చేతకాని తనంతోనే ఆమె నీకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యిందని తండ్రి రామ్ సింగ్ అతని కొడుకు రాజేష్ మీద పోలీసుల ముందే గొడవకు దిగాడు. పింకీ నాకు పిన్నీ అవుతుందా ?, నాకు భార్య అవుతుందా ? మీరే చెప్పండి అంటూ రాజేష్ ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక పోలీసులు తలలు పట్టుకున్నారు.

కొడుకుతో కాపురం చెయ్యలేను.... అతని తండ్రే కావాలి
పోలీసులు సైతం ఈ కేసును పరిష్కరించలేక ఇబ్బందులు పడుతున్నారు. రెండుసార్లు ఇరు వర్గాల వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వారు మాట వినడం లేదని పోలీసు అధికారి వినయ్ చౌహాన్ స్థానిక మీడియాకు చెప్పారు. తాను రెండో భర్త రామ్ సింగ్ తో సంతోషంగా కాపురం చేసుకుంటున్నానని, రాజేష్ తో మళ్లీ కాపురం చెయ్యడానికి వెళ్లలేనని ఆమె తేల్చి చెబుతోందని పోలీసు అధికారి వినయ్ చౌహాన్ అంటున్నారు.
Recommended Video

ముగ్గురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
తండ్రి, అతని కొడుకుతో పాటు ఇద్దరిని వివాహం చేసుకున్న మహిళకు నోటీసులు ఇచ్చి మరోసారి విచారణకు హాజరుకావాలని చెప్పామని, ఈ కేసు పరిష్కారానికి న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి వినయ్ చౌహాన్ అన్నారు. కొడుకు, తరువాత అతని తండ్రిని ఒకే మహిళ పెళ్లి చేసుకుందని వెలుగు చూడటం ఉత్తరప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications