ఉద్యోగులకు EPFO అదిరిపోయే న్యూస్- ఏకంగా 5 లక్షలకు..!

ఉద్యోగులకు భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పీఎఫ్ సంస్కరణల్లో భాగంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్న సంస్థ ఇవాళ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా మరో నిర్ణయం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ క్లెయిమ్ ల ఆటో సెటిల్మెంట్ ల మొత్తం పెంపు కోసం వస్తున్న విజ్ఞప్తులకు పరిష్కారం లభించినట్లయింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది.

ఈపీఎఫ్ఓ తమ చందాదారులైన ఉద్యోగులకు వివిధ సందర్భాల్లో తాము దాచుకున్న మొత్తంలో కొంత భాగాన్ని మూడు అవసరాలకు చెల్లిస్తుంటుంది. వీటిలో పెళ్లి-విద్య, ఇంటి స్థలం కొనుగోలు-నిర్మాణం, వైద్య ఖర్చులు వంటివి ఉన్నాయి. వీటికి వివిధ పరిమితుల్ని కూడా విధించింది. వీటి మేరకు సదరు మొత్తాన్ని ఉద్యోగులు అవసరాన్ని బట్టి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంది. అయితే ఇలా క్లెయిమ్ చేసుకున్న మొత్తాల్ని సెటిల్ చేసి ఉద్యోగులకు చెల్లించేందుకు పీఎఫ్ సంస్థ ఎక్కువ సమయం తీసుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో నుంచి పుట్టిందే క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్.

EPFO good news to employees enhanced claims auto-settlement limit to 5 lakhs now

అంటే పైన చెప్పిన కారణాల్లో ఏదో ఒక దాన్ని చూపించి తమకు కావాల్సిన మొత్తాన్ని ఉద్యోగి క్లెయిమ్ చేసుకున్నప్పుడు అది లక్ష రూపాయల వరకూ ఉంటే ఆటోమేటిగ్గా సెటిల్మెంట్ చేసి క్రెడిట్ చేస్తున్నారు. దీన్ని కరోనా సమయంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇలా ఆటో మేటిగ్గా సెటిల్మెంట్ అయ్యే క్లెయిమ్ మొత్తాన్ని పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ మొత్తాన్ని 5 లక్షలకు పెంచుతూ పీఎఫ్ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు 5 లక్షల వరకూ చేసిన క్లెయిమ్ లను ఆటో సెటిల్మెంట్ మోడ్ లో సెటిల్ చేస్తారు. ఈ నిర్ణయంతో క్లెయిమ్ సెటిల్మెంట్ టైమ్ కూడా 4 రోజులకు తగ్గనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+