రోడ్డు రోమియోలను పట్టించిన యువతి (వీడియో)
న్యూఢిల్లీ: అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న అకతాయిల భరతం పట్టడానికి ఒక యువతి ధైర్యం చేసింది. అమ్మాయిలను వేధిస్తున్న వారి ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టి అడ్డంగా బుక్ చేసింది. విషయం గుర్తించిన పోలీసు అధికారులు యువతి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
ఢిల్లీలో జాస్లీన్ కౌర్ అనే యువతి నివాసం ఉంటున్నది. ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో వెళుతున్న సమయంలో కౌర్ ను అల్లరిమూకలు వేధింపులకు గురి చేశారు. పదే పదే వేధింపులకు గురి చెయ్యడంతో కౌర్ విసిగిపోయింది.
అకతాయిలకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వారి ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అల్లరిమూకలను అరెస్టు చేసి బెండ్ తీశారు. ఇక మీద ఏ అమ్మాయి కనపడినా వారి వంక కన్నెత్తి చూడకుండా బుద్థి చెప్పారు. యువతి ధైర్యాన్ని మెచ్చుకుని రూ. 5 వేలు బహుమానం అందించామని డీసీపీ పుష్పేంద్ర కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications